తెలంగాణ

telangana

బెంగళూరుకు ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌.. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆరా

By

Published : Jan 29, 2023, 10:38 AM IST

Updated : Jan 29, 2023, 12:04 PM IST

Nandamuri Taraka Ratna: బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ తమ కుటుంబసభ్యులతో ప్రత్యేక విమానంలో బెంగళూరు చేరుకున్నారు. అక్కడ తారకరత్న కుటుంబసభ్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

బెంగళూరు బయల్దేరిన ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌
బెంగళూరు బయల్దేరిన ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌

Nandamuri Taraka Ratna: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కుప్పంలో ‘యువగళం’ పాదయాత్ర సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైన సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. తారకరత్నను చూసేందుకు సినీనటులు ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ తమ కుటుంబసభ్యులతో ప్రత్యేక విమానంలో బెంగళూరు చేరుకున్నారు. బాలకృష్ణ సతీమణి వసుంధర, నారా లోకేశ్‌ సతీమణి బ్రాహ్మణి, ఇతర కుటుంబసభ్యులు ఆస్పత్రి వద్దకు వెళ్లారు.

బెంగళూరు చేరుకున్న అనంతరం ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ నేరుగా ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ తారకరత్న కుటుంబసభ్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మరోవైపు కర్ణాటక వైద్యశాఖ మంత్రి సుధాకర్‌ కూడా నారాయణ హృదయాలయ ఆస్పత్రికి వచ్చారు. వైద్యులతో మాట్లాడి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

తారకరత్న మయోకార్డియల్‌ ఇన్‌ఫార్క్‌షన్‌ కారణంగా తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారని.. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని శనివారం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో వైద్యులు వెల్లడించారు. నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో వైద్యులు ఆయనకు అత్యున్నత వైద్యసేవలు అందిస్తున్నారు.

ఏం జరిగిందంటే?:టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. పల్స్‌ పడిపోవడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇవీ చదవండి :

Last Updated :Jan 29, 2023, 12:04 PM IST

ABOUT THE AUTHOR

...view details