తెలంగాణ

telangana

'ఎరువుల కొరత ఎక్కడా ఉండకూడదు... అప్రమత్తంగా ఉండండి'

By

Published : Jul 19, 2020, 7:40 AM IST

ఖరీఫ్ సీజన్​కు సంబంధించి ఎరువుల సరఫరా, రైతు వేదికల నిర్మాణంపై మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎరువులకు డిమాండ్ ఉంటుందని... అందుకు అనువుగా వాటిని రైతులకు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు.

minister-niranjan-reddy-review-on-kharif-season
'ఎరువుల కొరత ఎక్కడా ఉండకూడదు... అప్రమత్తంగా ఉండండి'

కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే... ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఉద్యోగులు విధులకు హాజరు కావాలని తెలంగాణ వ్యవసాయమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. బషీర్‌బాగ్‌లోని వ్యవసాయ శాఖ కమిషనరేట్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఎరువుల సరఫరా, రైతు వేదికల నిర్మాణంపై సమీక్ష చేపట్టారు.

వర్షాలు కురుస్తున్నందున రైతుల నుంచి... యూరియా, కాంప్లెక్స్, ఇతర ఎరువులకు డిమాండ్ పెరుతోందని... అందుకు తగినట్టు వాటిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఎరువుల కొరత ఎక్కడా లేకుండా చూడాలని ఆదేశించారు. కేంద్రం నుంచి రావాల్సిన యూరియా, ఎరువుల కోటాను... ఎప్పటికప్పుడు తీసుకుని... ఎంపిక చేసిన వాటిని స్టాక్‌ పాయింట్లకు తరలించాలని మంత్రి సూచించారు.

ఇదీ చూడండి: ప్లాస్మా కొరత.. దానం చేయాలంటూ విస్తృత ప్రచారం

ABOUT THE AUTHOR

...view details