Hyderabad CP On Traffic Challans: రెండేళ్లలో ట్రాఫిక్ చలాన్లు పేరుకుపోవటంతో రాయితీ కల్పించాలని నిర్ణయించినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ద్విచక్రవాహనాలు, ఆటోలకు జరిమానాలో 75 శాతం రాయితీ కల్పిస్తామని వివరించారు. 4 చక్రాల వాహనాలకు జరిమానాలో 50శాతం చెల్లిస్తే సరిపోతుందన్నారు. ఆన్‌లైన్, లోక్ అదాలత్ ద్వారా చెల్లింపు సౌకర్యం ఉంటుందని వెల్లడించారు. మార్చి 12వ తేదీన మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని ప్రకటించారు. రాయితీ ఇస్తే వాహనదారులు చెల్లించే అవకాశం ఉందని సీవీ ఆనంద్ అభిప్రాయపడ్డారు.
'రెండు సంవత్సరాలుగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలాన్లు వేస్తూ పోతున్నాం. కానీ ప్రజలు కట్టడం లేదు. దీనికి తోడు కోర్టు ప్రొసీడింగ్స్ కూడా జరగడం లేదు. 1.7 కోట్ల కేసులు నమోదయ్యాయి. వీటి చలాన్ల విలువ సుమారు రూ.500 కోట్లకు పైగానే ఉంటుంది. వీటిని కట్టే పరిస్థితుల్లో లేరు. దీని గురించి మేం జ్యుడీషియరీతో చర్చించాం. దీంతో రాయితీలిచ్చి చలాన్లు కట్టించుకోవాలని నిర్ణయం తీసుకున్నాం.'
-- సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ