ETV Bharat / state

CHALLANS: రూ.600 కోట్ల పెండింగ్​ చలాన్లు.. వసూలు కోసం రాయితీలు

author img

By

Published : Feb 19, 2022, 5:26 AM IST

Updated : Feb 19, 2022, 6:42 AM IST

CHALLANS: ట్రాఫిక్​ నిబంధనల ఉల్లంఘనలో పేరుకుపోయిన పెండింగ్​ చలాన్ల వసూళ్లకు పోలీసు శాఖ మార్గాలను అన్వేషిస్తోంది. హైదరాబాద్​ కమిషనరేట్​ పరిధిలో రాయితీలు ఇవ్వడం ద్వారా.. ఏళ్లుగా చెల్లించకుండా ఉన్న జరిమానాలు కట్టించాలని ప్రయత్నిస్తోంది.

CHALLANS: రూ.600 కోట్ల పెండింగ్​ చలాన్లు.. వసూలు కోసం రాయితీలు
CHALLANS: రూ.600 కోట్ల పెండింగ్​ చలాన్లు.. వసూలు కోసం రాయితీలు

CHALLANS: రూ.600 కోట్ల పెండింగ్​ చలాన్లు.. వసూలు కోసం రాయితీలు

CHALLANS: ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా.. పోలీసు శాఖ జరిమానాలతో ట్రాఫిక్​ నిబంధనల అమలుకు కృషి చేస్తోంది. అయితే కొందరు చలాన్లను భారంగా భావించి.. వాటిని చెల్లించకుండానే పోలీసులను తప్పించుకు తిరుగుతుంటారు. హైదరాబాద్ కమిషనరేట్​ పరిధిలో ఆ విధంగా 8 ఏళ్లలో రూ.600 కోట్లకు పైగా పెండింగ్ చలాన్లు పోగయ్యాయి. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్​ పోలీస్​ కమిషనర్ సీవీ ఆనంద్, ట్రాఫిక్​ పోలీస్​ ఉన్నతాధికారులు ఆ అంశంపై సమీక్షించారు. రాయితీ ఇస్తే.. పెండింగ్​ చలాన్లు వసూలయ్యే అవకాశముందని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. ఏ మేరకు రాయితీలు ఇవ్వాలన్న అంశంపై చర్చించి త్వరలోనే ప్రకటిస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

ఇకపై రాత్రి 11 నుంచి తెల్లవారుజాము 4 వరకు నిఘా..

తప్పని తెలిసినా అనేక మంది ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతూ.. ప్రమాదాలకు కారణం అవుతున్నారని పోలీసులు విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్​లో నాలుగైదేళ్లుగా నమోదైన ప్రమాదాలను అధ్యయనం చేయగా.. రాత్రి వేళల్లోనే ఎక్కువగా జరుగుతున్నట్లు గుర్తించారు. ఇందులో మద్యం మత్తు, అతివేగమే కారణంగా ఉంటోందని తేల్చారు. అందుకోసం రాత్రివేళల్లోనూ పని చేసే అత్యాధునికమైన స్పీడ్​ లేజర్​ గన్​లను త్వరలో తెప్పిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇకపై రాత్రి 11 నుంచి తెల్లవారుజాము 4 వరకు ట్రాఫిక్​ పోలీసులు షిఫ్టుల వారీగా విధులు నిర్వహిస్తారని చెప్పారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ట్యాంక్​బండ్​, మలక్​పేట, సికింద్రాబాద్, బోయిన్​పల్లి, తిరుమలగిరి ప్రాంతాల్లో వీరిని నియమించనున్నట్లు వెల్లడించారు.

1,279 వాహనాల వేలం..

ఇదే సమయంలో పలు కేసుల్లో సీజ్​ చేసిన వాహనాలను వేలం వేయాలని అధికారులు నిర్ణయించారు. సుమారు 1,279 వాహనాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయని హైదరాబాద్ పోలీస్​ కమిషనర్​ సీవీ ఆనంద్​ తెలిపారు. ఆయా వాహన యజమానులు.. ఆర్నెళ్లలో తమ వాహనాల ఆధారాలు చూపించి తీసుకొని వెళ్లవచ్చని.. లేని పక్షంలో వాటిని వేలం వేస్తామని కమిషనర్ స్పష్టం చేశారు.

పార్కింగ్​ సమస్యపైనా..

నగరంలో పార్కింగ్​ సమస్యపైనా శాస్త్రీయ అధ్యయనం చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. వివిధ కాలనీలు, గేటెడ్​ కమ్యూనిటీలతో చర్చిస్తూ.. పరిష్కారం దిశగా ఆలోచిస్తున్నామని చెబుతున్నారు.

ఇదీ చూడండి: Haritha nidhi: హరిత నిధికి ఎవరెవరు ఎంత విరాళాలు ఇవ్వాలంటే..

Last Updated : Feb 19, 2022, 6:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.