తెలంగాణ

telangana

Gruhalakshmi Scheme Last Date : 'గృహలక్ష్మి పథకానికి అప్లై చేయలేదా.. ఆందోళన వద్దు.. ఇంకా ఛాన్స్ ఉంది'

By

Published : Aug 9, 2023, 2:50 PM IST

Gruhalakshmi Scheme Last Date : గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ అని.. దరఖాస్తుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. గురువారంతో తొలి విడత గడువు ముగియనున్న తరుణంలో మంత్రి ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో గృహలక్ష్మి పథకానికి సంబంధించి.. అర్హుల జాబితా ఎలా ఎంపిక చేస్తారు..? ఎంత సహాయం చేస్తారు..? ఏయే పత్రాలు ఉండాలి..? అనే దానిపై మరింత సమాచారం తెలుసుకుందాం.

Grilahakshmi Scheme Eligible List
Prashanth Reddy on Gruhalakshmi scheme

Prashanth Reddy on Gruhalakshmi scheme :తెలంగాణ ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు తీసుకొచ్చిన గృహలక్ష్మి పథకం (Gruhalakshmi scheme) గడువు గురువారంతో ముగియనుంది. దీంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. రెండు రోజులే సమయం ఉండటంతో అర్హులు.. మీసేవ కేంద్రాల వద్ద (Mee Seva) క్యూ కట్టారు. ఈసారి అప్లికేషన్ చేయకుంటే సొంతింటి కల.. కలగానే మిగిలిపోతుందా అనే ఆందోళనలో కొందరు ఉన్నారు. ఈ నేపథ్యంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.

GruhaLakshmi Scheme in Telangana : 'గృహలక్ష్మి'కి దరఖాస్తుల కోసం బారులు.. గడువు పెంచాలంటూ విన్నపాలు

గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ అని.. దరఖాస్తుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్న ఆయన... పథకాన్ని నిరంతర ప్రక్రియగా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. గ్రామకంఠంలో ఉన్న పాత ఇల్లు, స్థలాలకు దస్తావేజు పేపర్లు ఉండని పక్షంలో ఇంటి నంబర్ ఆధారంగా ఖాళీ స్థలం ఉంటే.. దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి వివరించారు.

Gruhalakshmi Scheme in Telangana : గృహలక్ష్మి పథకానికి అప్లై చేస్తున్నారా.. ఐతే ఈ డాక్యుమెంట్స్​ ఉండాల్సిందే!

Grilahakshmi Scheme Eligible List :దరఖాస్తు గడువు అయిపోయిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న ప్రశాంత్ రెడ్డి... దరఖాస్తుదారులు తమ ప్రజాప్రతినిధులతో జిల్లా కలెక్టర్​కు ధరఖాస్తులు పంపించవచ్చని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గానికి ప్రస్తుతం మొదటి దశలో 3000 ఇళ్లు పూర్తయిన తరువాత రెండో దశలో ఇచ్చే గృహలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. దశల వారీగా అర్హులైన పేదల ఇంటి నిర్మాణం కోసం గృహలక్ష్మి అమలు చేయనున్నట్లు మంత్రి వివరించారు. మరోవైపు గృహలక్ష్మి పథకం ఆన్​లైన్ దరఖాస్తులు గురువారంతో మగియనుండగా.. ఈనెల 25 ఇళ్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సన్నహాలు చేస్తోంది.

దరఖాస్తు సమయంలో తీసుకెళ్లాల్సిన పత్రాలు ఇవే:

  • గృహలక్ష్మి పథకం దరఖాసు
  • దరఖాస్తుతో పాటు రేషన్ కార్డు
  • ఓటరు గుర్తింపు కార్డు
  • ఆధార్ కార్డు
  • ఇంటి స్థలం దస్తావేజులు

గృహలక్ష్మి పథకానికి సంబంధించి మరింత సమాచారం:

  • రెండు గదులు కూడిన ఆర్సీసీ ఇళ్లు నిర్మాణం కోసం ఆర్థికసాయం ఇస్తారు.
  • ఇంటి బేస్ మెంట్ లెవల్, రూఫ్ లెవల్, ఇళ్లు పూర్తి మూడు దశల్లో సాయం అందిస్తారు.
  • ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు పదిశాతం, బీసీ- మైనార్టీలకు 50 శాతానికి తగ్గకుండా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.
  • జిల్లాల వారీగా దరఖాస్తులను పరిశీలించి కలెక్టర్ అర్హులను ఎంపిక చేస్తారు.
  • ఎవరైతే ఈ పథకానికి అర్హత సాధిస్తారో వారికి మంత్రి ఆధ్వర్యంలో జిల్లా ఇన్​ఛార్జ్​లు ఈ పథకం వర్తింపు చేస్తారు.
  • ఆర్థికసాయం అందించగా మిగిలిన వారిని వెయిటింగ్ లిస్ట్​లో పెట్టి భవిష్యత్​లో ఆర్థికసాయం అందిస్తారు.
  • అధికారులు లబ్దిదారులను పరిశీలించి జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా కలెక్టర్ ఆమోదం పొందిన అనంతరం బ్యాంక్​ ఖాతాల్లో నగదు వేయనున్నారు.

'గృహలక్ష్మి పథకం' కింద మూడు విడతల్లో రూ.3 లక్షలు: మంత్రి హరీశ్‌రావు

Gruha Lakshmi scheme Telangana : ఆగస్టు నుంచి పట్టాలెక్కనున్న 'గృహలక్ష్మి పథకం'

రైతులకు పంట పరిహారం అందించేందుకు తక్షణమే చర్యలు తీసుకోండి: సీఎం కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details