తెలంగాణ

telangana

ఫెదరర్​కు మరో సర్జరీ.. యూఎస్​ ఓపెన్​కు దూరం

By

Published : Aug 16, 2021, 2:19 PM IST

Roger Federer
రోజర్ ఫెదరర్

దిగ్గజ ప్లేయర్ రోజర్​ ఫెదరర్​ (Roger Federer) యూఎస్​ ఓపెన్​కు (US Open) దూరం కానున్నాడు. చివరిసారిగా వింబుల్డన్​లో ఆడిన రోజర్​.. గాయం కారణంగా టోక్యో ఒలింపిక్స్​లోనూ ఆడలేకపోయాడు.

స్విస్​ టెన్నిస్​ దిగ్గజం రోజర్​ ఫెదరర్ (Roger Federer) మరోసారి మోకాలి సర్జరీ చేయించుకోనున్నాడు. దీంతో ఆగస్టు 30 నుంచి జరిగే యూఎస్​ ఓపెన్​కు (US Open) దూరం కానున్నాడు. చివరిసారిగా వింబుల్డన్​ సందర్భంగా రాకెట్​ పట్టిన ఈ స్టార్ ప్లేయర్.. మోకాలి గాయం వల్ల టోక్యో ఒలింపిక్స్​లో ఆడలేదు.

"వింబుల్డన్ తర్వాత జరిగిన పరిణామాలపై మీకు కొంత సమాచారం ఇవ్వాలనుకుంటున్నాను. నా మోకాలి గాయానికి సంబంధించి డాక్టర్లను కలిశాను. చాలా చెకప్​లు చేయించాను. నాకు సర్జరీ అవసరమని వారు సూచించారు. అందుకు నేను సిద్ధపడ్డాను. విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పారు" అని ఇన్​స్టా వేదికగా పోస్టు చేసిన ఓ వీడియోలో ఫెదరర్​ పేర్కొన్నాడు.

"ఈ శస్త్ర చికిత్స వల్ల నేను కొంతకాలం ఆసుపత్రిలో గడపాల్సి ఉంటుంది. కొన్ని నెలల పాటు ఆటకు దూరంగా ఉండాలి. ఇది కష్టమైనప్పటికీ నా ఆరోగ్యం దృష్ట్యా నాకిది చాలా అవసరం. త్వరలోనే మళ్లీ కోర్టులోకి దిగుతాను" అని రోజర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

చివరిసారిగా వింబుల్డన్​లో పాల్గొన్నాడు ఫెదరర్. పోలాండ్​ ఆటగాడు హర్కజ్​తో జరిగిన క్వార్టర్​ ఫైనల్లో 6-3, 7-6, 6-0 తేడాతో వరుస సెట్లలో ఓడిపోయాడు ఈ దిగ్గజ ప్లేయర్​.

ఇదీ చదవండి:ఆ నటితో లియాండర్ పేస్​ రిలేషన్​షిప్.. గోవాలో సందడి?

ABOUT THE AUTHOR

...view details