తెలంగాణ

telangana

Praggnanandhaa Modi : 'నిన్ను చూసి గర్విస్తున్నాను!'.. చెస్​ ఛాంప్​ ప్రజ్ఞానందతో మోదీ.. ఫొటోలు చూశారా?

By ETV Bharat Telugu Team

Published : Aug 31, 2023, 8:08 PM IST

Updated : Aug 31, 2023, 10:41 PM IST

Praggnanandhaa Modi : చెస్​ గ్రాండ్​ మాస్టర్​ ప్రజ్ఞానంద.. తన కుటుంబసభ్యులతో ప్రధాని నరేంద్ర మోదీని కలిశాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్​గా మారాయి.

Praggnanandhaa Modi
Praggnanandhaa Modi

Praggnanandhaa Modi :స్టార్​ చెస్ ప్లేయర్​.. గ్రాండ్​ మాస్టర్​ ప్రజ్ఞానందగురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశాడు. తన కుటుంబ సభ్యులతో పాటు దిల్లీకి వెళ్లిన ప్రజ్ఞానంద.. మోదీతో కాసేపు ముచ్చటించాడు. ఆ తర్వాత తాను గెలిచిన రజత పతకాన్ని మోదీకి చూపించాడు. అనంతరం మోదీ.. ప్రజ్ఞానంద ఫ్యామిలీతో సరదాగా గడిపారు. ఈ విషయాన్ని ప్రజ్ఞానంద ట్విట్టర్​లో పోస్ట్​ చేస్తూ.." ప్రధాని మోదీని వారి ఇంటికెళ్లి కలవడం సంతోషంగా ఉంది. నాతో పాటు నా తల్లిదండ్రులను ప్రోత్సహించినందుకు థ్యాంకూ సర్" రాసుకొచ్చాడు.

ఈ ట్వీట్​ను మోదీ రీ ట్వీట్ చేస్తూ.. " 7, లోక్ కల్యాణ్ మార్గ్​కు స్పెషల్ విజిటర్స్ వచ్చారు. ప్రజ్ఞానందనుఅతడి తల్లిదండ్రులను కలుసుకోవడం ఆనందంగా ఉంది. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని భారతదేశ యువతకు ఉదాహరణగా నిలిచాడు. నీ పట్ల గర్వంగా ఉంది" అని రాశారు.

Praggnanandhaa Stalin: ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్​ ముగించుకొని భారత్​కు వచ్చిన ప్రజ్ఞానందకు.. బుధవారం చెన్నై ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది. అతడికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా.. సంప్రదాయ నృత్యాలతో కళాకారులతో వెల్​కమ్​ చెప్పింది. అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, క్రీడా శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్.. ప్రజ్ఞానంద తల్లిదండ్రులను సన్మానించారు. అతడికి ప్రభుత్వం తరఫున రూ. 30 లక్షల రూపాయల పురస్కారం అందజేశారు.

Praggnanandhaa Mahindra :ఇక భారత్​లో ప్రముఖ కార్ల తయరీ సంస్థ మహీంద్ర గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర ప్రజ్ఞానందను అభినందించారు. అతడికి వారి సంస్థ తరపున మహీంద్ర ఎలెక్ట్రిక్ ఎస్​యూవీ 4OO కారును బహుకరించారు. దీనిపై ప్రజ్ఞానంద.." నా ఆనందాన్ని వ్యక్తం చేయడానికి మాటలు లేవు. సొంత కారు ఉండాలనే నా తల్లిదండ్రుల కలను నిజం చేశారు. థ్యాంక్యూ ఆనంద్ మహీంద్ర సర్" అని ట్వీట్ చేశాడు.

Praggnanandhaa Chess FIDE World Cup 2023 Final : ఇటీవలె జరిగిన ఫిడే చెస్‍ ప్రపంచకప్‍ ఛాంపియన్​షిప్​ ఫైనల్​లో.. ప్రపంచ నెం 1 మాగ్నస్ కార్ల్​సన్​ చేతిలో ప్రజ్ఞానంద ఓటమిపాలయ్యాడు. ర్యాపిండ్​ రౌండ్ ఫార్మాట్​లో జరిగిన ఫైనల్​ మొదటి గేమ్​లో కార్ల్​సన్​ గెలిచాడు. ఇక రెండో గేమ్​ డ్రా అవ్వడం వల్ల ప్రజ్ఞానంద రన్నరప్​తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Praggnanandhaa Next Tournament : 'విరామం లేదు.. విశ్రాంతి లేదు.. అయినా సోమవారం కొత్త పోరాటం'

ప్రపంచ ఛాంపియన్​కు మళ్లీ భారీ షాకిచ్చిన ప్రజ్ఞానంద

Last Updated :Aug 31, 2023, 10:41 PM IST

ABOUT THE AUTHOR

...view details