తెలంగాణ

telangana

ETV Bharat / sports

హాకీకి మరో భారత ప్లేయర్​ వీడ్కోలు.. కారణమిదే!

హాకీ క్రీడాకారుల రిటైర్మెంట్​ పరంపర కొనసాగుతోంది. తాజాగా టీమ్​ఇండియాకు 14ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించిన సీనియర్​ క్రీడాకారుడు ఎస్​వీ సునీల్ (SV Sunil) ఆటకు వీడ్కోలు పలికాడు.

sv sunil
ఒలింపిక్స్

By

Published : Oct 1, 2021, 5:04 PM IST

14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్​కు ముగింపు పలికాడు హాకీ సీనియర్​ ప్లేయర్ ఎస్​వీ సునీల్ (SV Sunil). 2014 ఆసియన్ గేమ్స్​లో స్వర్ణం సాధించిన జట్టులో సభ్యుడైన సునీల్​ శుక్రవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. టోక్యో ఒలింపిక్స్​లో భారత జట్టు కాంస్యం సాధించడంలో కీలకపాత్ర పోషించిన డ్రాగ్​ ఫ్లికర్ రూపిందర్ పాల్ సింగ్, డిఫెండర్ బీరేంద్ర లక్రా.. గురువారం ఆటకు వీడ్కోలు పలికారు. వీరి బాటలోనే నడిచాడు సునీల్. అయితే షార్టర్​ ఫార్మాట్​లో (ఐదుగురు సభ్యులుండే జట్టు) ఆడతానని ఇతడు స్పష్టం చేశాడు.

"విరామం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. 14 ఏళ్ల పాటు భారత్​కు ఆడాను. ఇక జాతీయ జట్టుకు అందుబాటులో ఉండకూడదని నిర్ణయించుకున్నా. ఇదంతా సులువైన నిర్ణయం కాదు. కఠినమైందీ కాదు. ఎందుకంటే టోక్యో గేమ్స్​కు (Tokyo Olympics) నేను ఎంపిక కాలేదు. 2024 పారిస్​ ఒలింపిక్స్​కు మరో మూడేళ్లు ఉన్నందున ఒక సీనియర్​ ప్లేయర్​గా గెలిచే జట్టు కోసం యువకులకు దారి ఇవ్వాల్సి ఉంది."

-ఎస్​వీ సునీల్, హాకీ ప్లేయర్

కర్ణాటకకు చెందిన 32 ఏళ్ల సునీల్.. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో వెదురు కర్రలతో హాకీ ఆడుతూ పెరిగాడు. 2007లో ఆసియా కప్​లో అరంగేట్రం చేశాడు. అందులో ఫైనల్లో పాకిస్థాన్​ను ఓడించి​ భారత్ పసిడి సాధించింది. మొత్తంగా ఇండియా​ తరఫున ఆడిన 264 మ్యాచుల్లో 72 గోల్స్​ చేశాడు సునీల్.

సునీల్ ఘనతలు..

  • అర్జున అవార్డు
  • 2012, 2016 ఒలింపిక్స్​లో (SV Sunil Olympics) భారత్​ తరఫున ప్రాతినిధ్యం
  • 2011 ఆసియన్ ఛాంపియన్​షిప్స్​లో స్వర్ణం, రజతం సాధించిన జట్టులో సభ్యుడు
  • 2014 ఆసియన్ గేమ్స్​లో (Asian Games) పసిడి, 2018 ఆసియన్​ గేమ్స్​లో కాంస్యం కైవసం చేసుకోవడంలో కీలకపాత్ర
  • 2017 ఆసియా కప్​ గెలిచిన జట్టులో సభ్యుడు
  • 2016, 2018 ఎఫ్​ఐహెచ్​ ఛాంపియన్స్​ ట్రోఫీలో రజతాలు గెలవడంలో ముఖ్య భూమిక
  • 2014 కామన్​వెల్త్​ క్రీడల్లో (Commonwealth Games) రజతం

ఇదీ చూడండి:రూపిందర్ బాటలో మరో హాకీ ప్లేయర్.. ఆటకు వీడ్కోలు

ABOUT THE AUTHOR

...view details