ETV Bharat / sports

రూపిందర్ బాటలో మరో హాకీ ప్లేయర్.. ఆటకు వీడ్కోలు

author img

By

Published : Sep 30, 2021, 4:36 PM IST

భారత హాకీ ఆటగాడు బీరేంద్ర లక్రా(birendra lakra news) ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. రూపిందర్ పాల్ (rupinder pal singh retired)​ వీడ్కోలు పలికిన కొద్ది గంటల్లోనే ఇతడూ రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాకిచ్చాడు.

Birendra Lakra
బీరేంద్ర

భారత హాకీ ఆటగాళ్లు ఒక్కొక్కరిగా రిటైర్మెంట్ ప్రకటిస్తూ అభిమానుల్ని షాక్​కు గురి చేస్తున్నారు. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్​లో టీమ్ఇండియా కాంస్యం నెగ్గడంలో కృషి చేసిన రూపిందర్ పాల్ సింగ్(rupinder pal singh retired)​ తన ఆటకు వీడ్కోలు పలకగా.. అతడి బాటలోనే నడిచాడు మరో స్టార్ ప్లేయర్ బీరేంద్ర లక్రా(birendra lakra news). ఈ విషయాన్ని హాకీ ఇండియా ట్విట్టర్​ ద్వారా వెల్లడించింది.

"ఒడిషా స్టార్ ఆటగాడు, గొప్ప డిఫెండర్, భారత జట్టు ఎన్నో విజయాల్లో ప్రధానపాత్ర పోషించిన బీరేంద్ర లక్రా ఆటకు వీడ్కోలు పలికాడు. హ్యాపీ రిటైర్మెంట్."

-హాకీ ఇండియా ప్రకటన

టోక్యో ఒలింపిక్స్(tokyo olympics 2020)​లో కాంస్యం నెగ్గిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు బీరేంద్ర(birendra lakra news). అలాగే 2014 ఆసియన్ గేమ్స్​లో స్వర్ణం, 2018లో కాంస్యం నెగ్గిన జట్టులోనూ కీలక పాత్ర పోషించాడు.

ఇతడి కంటే కొన్ని గంటల ముందు డ్రాగ్ ఫ్లికర్ రూపిందర్​ పాల్(rupinder pal singh retired)​ హాకీకి రిటైర్మెంట్ ప్రకటించాడు(పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి) . టోక్యో ఒలింపిక్స్​లో భారత జట్టు తరఫున గొప్ప ప్రదర్శన చేశాడీ ప్లేయర్ (పూర్తి స్టోరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి). యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం కోసమే వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించాడు.

ఇవీ చూడండి: అదరగొడుతున్న ఐపీఎల్.. రికార్డు వ్యూయర్​షిప్​తో దూకుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.