Pakistan Cricketers Salary :2023 ప్రపంచకప్‌లో దాయాది పాకిస్థాన్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన పాక్... కేవలం 2 విజయాలు నమోదు చేసి.. 4 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. దీంతో పాకిస్థాన్ సెమీస్ ఆశలు దాదాపు ఆవిరైనట్లే. దీంతో పాకిస్థాన్ ప్లేయర్లు.. వారి ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమవుతున్నారు.
అయితే ప్రస్తుతం దాయాది జట్టు అనేక విమర్శలు ఎదుర్కుంటున్న సమయంలో.. పాక్ మాజీ ఆటగాడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. గత ఐదు నెలలగా ప్లేయర్లకు.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు జీతాలు చెల్లించట్లేదని ఆ జట్టు మాజీ వికెట్ కీపర్ రషీద్ లతీఫ్ ఆరోపించారు. అలాగే వారికి బోర్డు నుంచి ఎలాంటి మద్దతు కూడా లభించడం లేదని అన్నారు. 'పాక్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్.. బుధవారం నుంచి బోర్డు ఛైర్మన్ జాకా అష్రఫ్‌కు ఫోన్ చేస్తే ఆయన రెస్పాన్స్ ఇవ్వట్లేదు. అలాగే చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సల్మాన్ నసీర్, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఉస్మాన్ వాల్హ కూడా బాబర్‌కు స్పందించడం లేదు' అని లతీఫ్ అన్నారు.
అయితే పాక్ క్రికెట్ బోర్డు ఇటీవల ఆటగాళ్లతో కొత్త కాంట్రక్ట్ కుదుర్చుకుంది. ఈ కాంట్రాక్ట్ ప్రకారం ప్లేయర్లు భారీ మొత్తంలో పారితోషికం అందుకోనున్నారని అప్పట్లో బోర్డు తెలిపింది. మొత్తం 25 మంది ఆటగాళ్లను ఈ కాంట్రాక్ట్‌లో చేర్చింది. వారిని A, B, C, D అని 4 కేటగిరీలుగా విభజించింది.