ETV Bharat / sports

Special Security To Babar Azam : పాక్ కెప్టెన్​ బాబర్​కు బంగాల్​లో స్పెషల్​ సెక్యురిటీ.. ఎందుకో తెలుసా?

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 27, 2023, 6:17 PM IST

Special Security To Babar Azam : చాలాకాలం తర్వాత దాయాది దేశం పాకిస్థాన్​ క్రికెట్​ జట్టు కోలకతాలో ఆడనుంది. ఇందుకోసం ఆ జట్టు కెప్టెన్​ బాబర్ ఆజమ్‌​కు స్పెషల్​ సెక్యురిటీని ఏర్పాటు చేశారు బంగాల్ పోలీసులు. ఇంతకీ బాబర్​కు ఎందుకంత భద్రత అంటే?

Special Security To Babar Azam By Kolkata Police
Special Security To Babar Azam

Special Security To Babar Azam : 2023 ప్రపంచకప్​లో భాగంగా బంగ్లాదేశ్​తో తలపడనుంది పాకిస్థాన్​ క్రికెట్ టీమ్​. కోల్​కతాలోని ఈడెన్​ గార్డెన్స్​లో మంగళవారం ఈ మ్యాచ్​ జరగనుంది. అయితే చాలాకాలం తర్వాత ఈ స్టేడియంలో ఆడనుంది పాకిస్థాన్​. ఈ నేపథ్యంలో ఆ జట్టు కెప్టెన్​ బాబర్​ ఆజమ్ కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు బంగాల్​ పోలీసులు. ఇందుకోసం స్పెషల్​ సెక్యురిటీ టీమ్​ను నియమించారు. పాక్​ క్రికెట్​ జట్టు శనివారం కోలకతాకు చేరుకుంటుంది.

"పాకిస్థాన్ క్రికెట్ జట్టుతో పాటు కెప్టెన్ బాబర్ ఆజమ్‌ శనివారం కోల్‌కతాకు చేరుకుంటారు. ఎయిర్​పోర్ట్​కు చేరుకున్న వెంటనే ఆయన స్పెషల్​ సెక్యురిటీ టీమ్​ పర్యవేక్షణలో బస చేయనున్న సిటీ హోటల్​కు చేరుకుంటారు. అక్కడ ఆయనకు ఏర్పాటు చేసిన ప్రత్యేక గది బయట కూడా మా సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తారు."
-కోల్​కతా పోలీసు ఉన్నతాధికారులు

మైదానంలో కూడా..
బాబర్​ బస చేసే హోటల్​ లోపల, బయటనే కాకుండా ఆయన ఆడే ఈడెన్​ మైదానంలోనూ పోలీసులు రక్షణగా ఉండనున్నారు. ఇందుకోసం అంతర్గత భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆజమ్​ ఫీల్డింగ్​ చేసే సమయంలో కూడా బౌండరీల వద్ద ప్రత్యేకంగా శిక్షణ పొందిన భద్రతా సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. ఎందుకంటే స్టేడియంకు వచ్చే అభిమానులు, ప్రేక్షకుల నుంచి బాబర్​ ఎటువంటి చేదు అనుభవాలు ఎదుర్కోకుండా ఉండేందుకే కోల్​కతా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఓ పోలీసు ఉన్నతాధికారి ఈటీవీ భారత్​తో చెప్పారు.

'గతంలో ఏదైనా ఆటగాడి కోసం ఈ రకమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారో, లేదో నాకు తెలియదు. కానీ, పాక్​ కెప్టెన్​ బాబర్​ ఆజమ్​ కోసం మాత్రం ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నాము. భద్రతా కారణాల దృష్ట్యా దీనికి సంబంధించి ఇంతే సమాచారం చెప్పగలను' అని కోల్‌కతా పోలీసు అదనపు కమిషనర్ ఈటీవీ భారత్‌తో అన్నారు.

ఎందుకంత భద్రత..?
సాధారణంగా బాబర్​ పాక్​ ఆటగాడైనప్పటికీ అతడికి విదేశాల్లోనూ పెద్ద ఎత్తున ఫ్యాన్​ ఫాలోయింగ్​ ఉంది. అంతేకాకుండా బాబర్​ పెద్దగా ఎవరితోనూ కలవని వ్యక్తి. సరదాలు, ఆనందానికి దూరంగా ఉండేందుకు ఇష్టపడతాడు. అందుకని అభిమానులెవ్వరూ ఆయన్ను ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రత్యేకంగా శిక్షణ పొందిన కమాండో ఫోర్స్ స్పెషల్ యాక్షన్ ఫోర్స్​(SAF)ను కోల్‌కతా పోలీసులు బాబర్​ ఆజమ్​ కోసం ఏర్పాటు చేశారు. పాక్ క్రికెట్ జట్టు నగరంలో ఉన్న సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ రెండంచెల భద్రతా సిబ్బంది పనిచేస్తుంది.

ODI World Cup 2023 Rohith Sharma : కెప్టెన్​గా 100వ మ్యాచ్​.. అరుదైన రికార్డ్​పై హిట్‌ మ్యాన్‌ గురి

PAK Vs SA World Cup 2023 : తీవ్ర ఒత్తిడిలో బాబర్​ సేన.. ఆ ఫార్ములతో టాప్​ ప్లేస్​పై కన్నేసిన సౌతాఫ్రికా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.