Asia Cup 2023 : ఆసియా కప్‌పై కొనసాగుతున్న ప్రతిష్టంభన వీడటం లేదు. ఆసియా కప్ కోసం పాకిస్థాన్‌కు రాబోమని బీసీసీఐ తేల్చిచెప్పింది. దీంతో ఆసియా వేదికపై ప్రతిష్టంభన నెలకొంది. దీనికి పాకిస్థాన్ ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్‌ను కూడా భారత్ తిరస్కరించింది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. పాకిస్థాన్ లేకుండానే ఆసియా కప్ ఆడే ఆవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ టోర్నమెంట్లో పాల్గొనడానికి.. పాకిస్థాన్ మినహా ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) సభ్య దేశాలన్నీ ఆసక్తి చూపినట్లు సమాచారం. పాకిస్థాన్‌లో కాకుండా మరో వేదికపై నిర్వహించేదుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై పాక్ తన మాటకే పట్టుబడితే.. ఆ జట్టు లేకుండా ఈ సారి ఆసియా జరగనుందని తెలుస్తోంది.
Asai cup Pakisthan : యూఏఈనీ తటస్థ వేదికగా పాకిస్థాన్ ప్రతిపాదించింది. అయితే అక్కడ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందని.. అందుకే ఆ ప్రతిపాదనను బీసీసీఐ తిరస్కరించినట్లు సమాచారం. అయితే, అప్పటినుంచి వేదికగా శ్రీలంక పేరు వినిపిస్తోంది. దీనికి తోడు ఆసియా కప్ 2023ని పాక్‌లో కాకుండా శ్రీలంకలో ఆడటానికి మిగతా సభ్య దేశాలను ఏసీసీ అధ్యక్షుడు జై షా ఒప్పించారని వార్తలు వస్తున్నాయి. ఇతర ఏసీసీ దేశాలు కూడా ఇదే స్వరాన్ని వినిపిస్తున్నట్లు సమాచారం. ఈ వేదికకు పాక్ ఒప్పుకోక పోతే.. ఆ దేశం లేకుండా టోర్నీ జరుగుతుంది. రాబోయే ఆసియా క్రికెట్ మండలి సమావేశంలో సభ్య దేశాలన్నీ శ్రీలంకనే వేదికగా ఏకగ్రీవంగా ఆమెదించే అవకాశాలున్నాయి. ఇలా జరిగితే ఏసీసీ నిర్ణయాన్ని అంగీకరించడం లేదా టోర్నీ నుంచి పూర్తిగా వైదొలగం తప్ప పాకిస్థాన్‌కు మరోక మార్గం లేదు.