తెలంగాణ

telangana

'18పేజీస్'​ రిలీజ్​ డేట్​.. 'దృశ్యం 2' అప్డేట్

By

Published : Nov 14, 2021, 1:48 PM IST

Updated : Nov 14, 2021, 1:55 PM IST

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి(cinema updates). ఇందులో '18 పేజీస్'​, 'దృశ్యం 2', 'గని', 'ఛలో ప్రేమిద్దాం' చిత్రాల సంగతులు ఉన్నాయి.

cinema
సినిమా అప్డేట్స్​

యువ హీరో నిఖిల్‌, అందాల భామ అనుపమ పరమేశ్వరన్‌(nikhil new movie 2021) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం '18 పేజీస్‌'. విభిన్నమైన ప్రేమ కథతో యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా సిద్ధమవుతోంది. ఈ సినిమా విడుదల తేదీపై తాజాగా చిత్రబృందం స్పందించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న '18 పేజీస్‌' చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. "ఒకవేళ ఓ ఫోన్‌.. పుస్తకంతో ప్రేమలో పడితే.. ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా? అయితే, 18న సిద్ధంగా ఉండండి" అని నిర్మాణ సంస్థ పేర్కొంది. ఈ సినిమాలో అనుపమ కథలు చదవడమే కాకుండా రాయడానికి ఆసక్తి కనబరిచే యువతిగా కనిపించనున్నారు. ఇక, నిఖిల్‌ ఫుల్‌(nikhil anupama new movie) యంగ్‌ లుక్‌లో మరింత జోష్‌ఫుల్‌గా పాత్రలో సందడి చేయనున్నారు. సుకుమార్‌ అందించిన కథతో సూర్యప్రతాప్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. గోపీసుందర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

18 పేజీస్​

మెగాప్రిన్స్​ వరుణ్​ తేజ్​ హీరోగా బాక్సింగ్​ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం 'గని'(varun tej gani trailer). ఈ చిత్రంలో నటిస్తున్న బాలీవుడ్​ నటుడు సునీల్ శెట్టిని విక్రమాదిత్య, కన్నడ నటుడు ఉపేంద్రను విజేందర్​ సిన్హాగా పరిచయం చేస్తూ ఓ కొత్త పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ మూవీ టీజర్​ను నవంబరు 15న విడుదల చేయనున్నారు. ఇక ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్​గా నటిస్తుండగా సునీల్ శెట్టి, ఉపేంద్ర(Upendra New Movie) కీలకపాత్రలు పోషిస్తున్నారు. కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

గని

సాయి రోనక్‌ హీరోగా సురేష్‌ శేఖర్‌ రేపల్లె తెరకెక్కించిన చిత్రం 'ఛలో ప్రేమిద్దాం'. తాజాగా ఈ చిత్రంలోని 'పిల్ల నీవల్లా' పాట విడుదలై ఆకట్టుకుంటోంది. ఉదయ్‌ కిరణ్‌ నిర్మించారు. నేహ సోలంకి కథానాయిక. భీమ్స్‌ సిసిరోలియో స్వరాలందించారు. ఈ సినిమా ఈనెల 19న థియేటర్లలో విడుదల కానుంది.

విక్టరీ వెంకటేశ్ నటించిన​ 'దృశ్యం 2'(Drishyam 2 release date) నవంబరు 25న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్​ ప్రైమ్​లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్​ను విడుదల చేసేందుకు సిద్ధమైంది చిత్రబృందం. నవంబరు 15న రిలీజ్​ చేయనున్నట్లు తెలిపింది.

దృశ్యం 2
సినిమా అప్డేట్​

ఇదీ చూడండి: ప్రేయసితో స్టార్​ నటుడి నిశ్చితార్థం

Last Updated :Nov 14, 2021, 1:55 PM IST

ABOUT THE AUTHOR

...view details