తెలంగాణ

telangana

ట్రైలర్స్​తో హిందీ చిత్రాలు.. 'వరుడుకావలెను' సర్​ప్రైజ్​

By

Published : Oct 25, 2021, 3:44 PM IST

కొత్త సినిమా కబుర్లు వచ్చాయి. ఇందులో 'బంటీ ఔర్​ బబ్లీ', 'సత్యమేవ జయతే 2', 'జైభీమ్​' హిందీ ట్రైలర్​ సహా 'హీరో', 'వరుడుకావలెను', 'షెహ్జాదా' చిత్రాల సంగతులు ఉన్నాయి.

cinema
సినిమా అప్డేట్స్​

'బంటీ ఔర్​​ బబ్లీ 2'(bunty aur babli 2 trailer) కొత్త ట్రైలర్​ విడుదలై నవ్వులు పూయిస్తోంది. నవంబరు 19నుంచి థియేటర్లలో సందడి చేయనుందీ చిత్రం(bunty aur babli 2 release date). ఈ చిత్రానికి వరుణ్​ వి. శర్మ దర్శకత్వం వహించగా.. సైఫ్​ అలీ ఖాన్​, రాణీ ముఖర్జీ, సిద్ధాంత్​ చతుర్వేది, శర్వారీ ప్రధాన పాత్రల్లో నటించారు.

హిందీ ప్రచార చిత్రం

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య-దర్శకుడు టి.ఎస్‌.జ్ఞానవేల్‌ కలయికలో తెరకెక్కిన సినిమా 'జైభీమ్​'(surya jai bhim movie). నవంబరు 2న అమెజాన్​ ప్రైమ్​లో విడుదల కానుంది(surya jai bhim movie release date). ఈ సందర్భంగా ఈ చిత్ర హిందీ ట్రైలర్(jaibhim trailer)​ను విడుదల చేసింది చిత్రబృందం. ఏ తప్పు చేయని బలహీన వర్గ మహిళను కేసు నుంచి బయటపడేసే లాయర్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు సూర్య. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ మూవీని నిర్మించారు.

'వరుడుకావలెను' సర్​ప్రైజ్​

'వరుడుకావలెను'(varudu kaavalenu movie release date) సినిమా అక్టోబర్​ 29న థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్​ను డిఫరెంట్​గా ప్లాన్​ చేసింది(naga shaurya ritu varma movie). నాగశౌర్య, రీతూవర్మ సహా మిగతా మూవీటీమ్​.. నేడు(అక్టోబర్​ 25) హైదరాబాద్​లో జరుగుతున్న కొన్ని పెళ్లిల్లకు హజరై అభిమానులను సర్​ప్రైజ్​ ఇచ్చారు. ​ఈ చిత్రానికి లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. తమన్‌ సంగీతమందించారు. మురళీ శర్మ, నదియా, వెన్నెల కిశోర్‌, ప్రవీణ్‌, హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు.

నాగశౌర్య, రీతూవర్మ
వరుడు కావలెను మూవీ టీమ్​ సర్​ప్రైజ్​

త్రిపాత్రాభినయం

జాన్‌ అబ్రహాం, దివ్య ఖోస్ల కుమార్‌(john abraham satyameva jayate 2) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'సత్యమేవ జయతే 2'. మిలప్‌ ఝవేరి దర్శకుడు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్(john abraham satyameva jayate 2 trailer)​ విడుదలై ఆకట్టుకుంటోంది. ఇందులో జాన్​ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. గతంలో వచ్చిన సత్యమేవ జయతే చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుందీ సినిమా.

సాంగ్​ రిలీజ్​

అశోక్​గల్లా, నిధిఅగర్వాల్​ జంటగా నటించిన సినిమా 'హీరో'(hero movie telugu 2021). ఈ చిత్రంలోని 'అచ్చ తెలుగందమే' పాట విడుదలైంది(ashok galla hero movie release date). శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. జిబ్రాన్​ సంగీతం అందిస్తున్నారు.

షూటింగ్​ షురూ

కార్తీక్​ ఆర్యన్​ నటిస్తున్న 'షెహ్జాదా'(kartik aryaan new movie) చిత్ర షూటింగ్​ ప్రారంభమైంది. కృతిసనన్​, పరేష్​రావల్​, మనీషా కోయిరాలా కీలక పాత్రలు పోషిస్తున్నారు. రోహిత్​ ధావన్​ దర్శకుడు. 2022 నవంబరు 4న విడుదల కానుందీ మూవీ.

కార్తీక్​ ఆర్యన్​ కొత్త చిత్రం ప్రారంభం

ఇదీ చూడండి: Ott this week: ఈ వారం థియేటర్​/ఓటీటీలో వచ్చే సినిమాలివే

ABOUT THE AUTHOR

...view details