దసరా(dussehra 2021) తర్వాత తెలుగు రాష్ట్రాల్లో వెండితెరపై చిన్న సినిమాల హవా కొనసాగుతోంది. కరోనా(corona cases in india) కారణంగా వాయిదా పడుతూ వచ్చిన చిత్రాలు థియేటర్‌లవైపు క్యూ కడుతున్నాయి. ఈ వారం కూడా కొన్ని చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వీటితో పాటు ఓటీటీలోనూ ఇంకొన్ని సినిమాలు సందడి చేయటానికి సిద్ధమయ్యాయి. మరి ఆ సినిమాలేంటో చూసేద్దామా!
ఆగి ఆగి వస్తున్న 'రొమాంటిక్'
ఆకాష్ పూరీ, కేతికా శర్మ జంటగా అనిల్ పాదూరి దర్శకత్వం వహించిన చిత్రం 'రొమాంటిక్'(romantic movie release date). పూరీ కనెక్ట్స్ పతాకంపై పూరీ జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఈనెల 29న థియేటర్లలో విడుదల కానుంది. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. యువతను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ఇటీవల ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించగా, సునీల్ కశ్యప్ స్వరాలు సమకూర్చారు.
మరో ఫీల్‌గుడ్ మూవీతో నాగశౌర్య
నాగశౌర్య-రీతూవర్మ జంటగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'వరుడు కావలెను'(varudu kaavalenu review). లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహించారు. అక్టోబరు 29న థియేటర్‌లలో విడుదలకు సిద్ధమైంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. తమన్ సంగీతమందించారు. మురళీ శర్మ, నదియా, వెన్నెల కిశోర్, ప్రవీణ్, హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు.
రెండు జంటల 'తీరం'
అనిల్ ఇనమడుగు కథానాయకుడిగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం 'తీరం'(theeram movie). శ్రావణ్ వై.జి.టి మరో కథా నాయకుడు. క్రిస్టెన్ రవళి, అపర్ణ కథానాయికలు. యం.శ్రీనివాసులు నిర్మాత. ఈ చిత్రాన్ని సినేటెరియా గ్రూప్ సంస్థ అధినేత వెంకట్ బోలేమోని ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 'ప్రేమ, రొమాంటిక్ అంశాలతో కూడిన చిత్రమిది. రెండు జంటల నేపథ్యంలో సాగుతుంది. సినిమా ప్రేక్షకుల్ని తప్పకుండా మెప్పిస్తుంది' అని దర్శకుడు అనిల్ అంటున్నారు.
'రావణ లంక'లో ఏం జరిగింది?
క్రిష్ బండిపల్లి, అస్మిత కౌర్ జంటగా నటించిన చిత్రం ‘రావణ లంక’(ravana lanka movie). మురళీశర్మ, రచ్చ రవి, దేవ్‌గిల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. బి.ఎన్.ఎస్.రాజు దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబరు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉజ్జల కుమార్ సాహా స్వరాలు సమకూరుస్తున్నారు. విహారయాత్ర కోసం వెళ్లి నలుగురు స్నేహితుల్లో ఒకరు అనుమానాస్పద రీతిలో చనిపోతారు. అప్పుడు మిగిలిన వాళ్లు ఏం చేశారు? అది హత్య? ఆత్మహత్య? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలివే
అమెజాన్ ప్రైమ్
* డైబుక్(హిందీ) అక్టోబరు 29
నెట్‌ఫ్లిక్స్
* లాభం(తమిళం) అక్టోబరు 24
* హిప్నోటిక్, అక్టోబరు 27
* ఆర్మీ ఆఫ్ దీవ్స్ , అక్టోబరు 29
జీ5
* ఆఫత్ ఈ ఇష్క్(హిందీ) అక్టోబరు 29
సోనీలివ్
* ఫ్యామిలీ డ్రామా(తెలుగు చిత్రం)అక్టోబరు 29
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
* హమ్ దో హమారే దో(హిందీ) అక్టోబరు 29
ఆల్ట్ బాలాజీ
* గిర్‌గిట్(వెబ్‌సిరీస్) అక్టోబరు 27