తెలంగాణ

telangana

ETV Bharat / crime

Conistables saves Patients: కానిస్టేబుళ్ల మానవత్వం.. డీజీపీ ప్రశంసలు

ఓ రోగి ఆత్మహత్యకు యత్నించగా అతన్ని కానిస్టేబుల్(Conistable) రక్షించాడు. గాంధీ ఆస్పత్రిలో(gandhi hospital) ఆరో అంతస్తు నుంచి దూకేందుకు ప్రయత్నిస్తున్న రోగి ప్రాణాలు నిలిపాడు. పోలీసు చేసిన మంచిపనికి వార్డులోని మిగతా రోగులు అభినందించారు. గాంధీ ఆస్పత్రి వద్దే గర్భిణికి మరో కానిస్టేబుల్ కిరణ్ సాయం చేసి శెభాష్​ అనిపించుకున్నాడు.

Conistable saves a Patient who committed for suicide
గాంధీ ఆస్పత్రి వద్ద పోలీసుల మానవత్వం

By

Published : Sep 27, 2021, 4:30 PM IST

Updated : Sep 27, 2021, 5:36 PM IST

గాంధీ ఆస్పత్రిలో ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిన ఓ రోగిని కానిస్టేబుల్ (Conistable saves a Patient )కాపాడాడు. గాంధీ ఆస్పత్రి(gandhi hospital) వద్ద విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ఇమ్రాన్​కు ఆరో అంతస్తు నుంచి పెద్దగా అరుపులు వినిపించాయి. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న కానిస్టేబుల్​కు బాల్కనీలో నుంచి కిందికి దూకేందుకు ప్రయత్నిస్తున్న ఓ రోగి కనిపించాడు.

ఆరో అంతస్తు నుంచి దూకేందుకు యత్నించిన రోగిని కాపాడిన ఇమ్రాన్

పోలీసు దగ్గరికి రావడాన్ని గమనించిన రోగి శేఖర్ పక్కనే ఉన్న పైపులు పట్టుకొని కిందికి దూకే ప్రయత్నం చేశారు. వెంటనే చాకచక్యంగా వ్యవహారించిన కానిస్టేబుల్ శేఖర్​ను గట్టిగా పట్టుకున్నాడు. మిగతా వాళ్ల సాయంతో అతన్ని సురక్షితంగా వార్డులోకి తీసుకొచ్చాడు. సాహసం చేసి ఓ రోగిని కాపాడినందుకు వార్డులోని మిగతా రోగులందరూ కానిస్టేబుల్ ఇమ్రాన్​ను అభినందించారు.

ఆరో అంతస్తు నుంచి దూకేందుకు యత్నించిన రోగిని కాపాడిన ఇమ్రాన్

గర్భిణికి సాయం చేసిన మరో కానిస్టేబుల్

గాంధీ ఆస్పత్రి వద్ద గర్భిణికి మరో కానిస్టేబుల్ కిరణ్ సాయం చేసి శభాష్​ అనిపించుకున్నారు. అక్కడే విధుల్లో ఉన్న కిరణ్ నడవలేని స్థితిలో ఉన్న గర్భిణిని చేతులపై మోసుకెళ్లి ప్రసూతి వార్డులో చేర్చారు. మానవత్వంతో వ్యవహరించి సాయం చేసిన కిరణ్​ను ఆస్పత్రి సిబ్బంది అభినందించారు.

గర్భిణిని చేతులపై మోసుకెళ్లిన కానిస్టేబుల్ కిరణ్

డీజీపీ ప్రశంసలు

రెండు సందర్భాల్లోనూ మానవత్వంతో వ్యవహరించిన ఇద్దరు కానిస్టేబుళ్లను రాష్ట్ర డీజీపీ మహేందర్​ రెడ్డి అభినందించారు. కానిస్టేబుళ్లు ఇమ్రాన్, కిరణ్​ చేసిన మంచిపనికి ప్రశంసలు అందుకున్నారు.

ఇదీ చూడండి:Suicide Attempt at TS Assembly : అసెంబ్లీ ముందు వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Last Updated : Sep 27, 2021, 5:36 PM IST

ABOUT THE AUTHOR

...view details