ETV Bharat / crime

Suicide Attempt at TS Assembly : అసెంబ్లీ ముందు వ్యక్తి ఆత్మహత్యాయత్నం

author img

By

Published : Sep 27, 2021, 12:47 PM IST

Updated : Sep 27, 2021, 1:16 PM IST

అసెంబ్లీ ముందు వ్యక్తి ఆత్మహత్యాయత్నం
అసెంబ్లీ ముందు వ్యక్తి ఆత్మహత్యాయత్నం

12:45 September 27

Suicide Attempt Ts Assembly : అసెంబ్లీ ముందు వ్యక్తి ఆత్మహత్యాయత్నం

అసెంబ్లీ ముందు ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం(Suicide Attempt at TS Assembly) చేశాడు. ఆటోలో వచ్చిన అతను.. ఒంటిపై డీజిల్​ పోసుకుని నిప్పంటించుకునేందుకు(Suicide Attempt at TS Assembly) యత్నించాడు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తమై.. అడ్డుకున్నారు. అతణ్ని పోలీస్ స్టేషన్​కు తరలించారు. 

మరోవైపు శాసనసభ సమావేశాలకు కాంగ్రెస్ నేతలు గుర్రపుబండ్లపై వచ్చారు. ఆ బండ్లను పోలీసులు అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించకపోవడం వల్ల హస్తం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ గేటు ముందు బైఠాయించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సామాన్యులపై కేంద్ర విధానాలను వ్యతిరేకిస్తూ గుర్రపుబండ్లపై వస్తే తమను అసెంబ్లీలోకి అనుమతించడం లేదని ఆందోళన చేశారు. వారిని అడ్డుకున్న పోలీసులు.. పోలీస్ స్టేషన్​కు తరలించారు.

Last Updated : Sep 27, 2021, 1:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.