తెలంగాణ

telangana

ETV Bharat / city

RS PRAVEEN KUMAR: 'బహుజన రాజ్యం చాలా దగ్గరగా ఉందనిపిస్తోంది'

రానున్న ఎన్నికల్లో బహుజన్​ సమాజ్ పార్టీ రాజ్యాధికారంలోకి వస్తుందని.. మాజీ ఐపీఎస్​ అధికారి ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, భాజపాలు బీసీలను మోసం చేస్తున్నాయని.. పథకాలతో తెరాస మోసం చేస్తోందని ఆరోపించారు. నల్గొండలో నిర్వహించిన సభలో బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్ రాంజీ గౌతమ్ సమక్షంలో ప్రవీణ్​కుమార్... పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. తనను రాష్ట్ర కో-ఆర్డినేటర్​గా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

RS PRAVEEN KUMAR
RS PRAVEEN KUMAR

By

Published : Aug 8, 2021, 10:05 PM IST

Updated : Aug 9, 2021, 3:58 PM IST

తాము బానిసలం కాదు.. పాలకులమని.. బీఎస్పీలో చేరిన సందర్భంగా మాజీ ఐపీఎస్​ అధికారి ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​ స్పష్టం చేశారు. ఈ రోజు తన జీవితంలో మరపురాని రోజని అన్నారు. రాజీనామా నిర్ణయం తన తల్లితో చెప్పినప్పుడు..' మన కుటుంబంలోనే చాలా మంది కూలీ పనులు చేస్తున్నారు... నువ్వు ఒక్కడివే ఐపీఎస్​వు ఉన్నావని చెప్పుకుంటున్నాం. నీ ఒక్కడి వల్ల మార్పు వస్తుందా' అని ప్రశ్నించిందని ప్రవీణ్ ​కుమార్​ చెప్పారు. తాను ఒక్కడినే కాదని.. ఎందరో ప్రవీణ్ ​కుమార్​లు ఉన్నారని చెప్పానని తెలిపారు. తానొక్కడినే సంతోషపడితేకాదు.. తనలాంటి వాళ్లు అందరూ అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నట్లు తన తల్లితో చెప్పాన్నారు.

ప్రగతిభవన్​కు తప్పనిసరిగా పోదాం..

నల్గొండ ఎన్‌జీ కళాశాల మైదానంలో నిర్వహించిన 'రాజ్యాధికార సంకల్ప సభ'లో బీఎస్పీ జాతీయ కో ఆర్డినేటర్​, రాజ్యసభ సభ్యుడు రాంజీ గౌతమ్... ఆర్​ఎస్​ ప్రవీణ్‌కుమార్​ను పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ కండువా కప్పి... సభ్యత్వం అందజేశారు. ప్రవీణ్ కుమార్‌ను బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్‌గా ప్రకటించారు. అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి వచ్చానని.. ఎన్ని కుట్రలు చేసినా తమ బిడ్డలు ఆగరని.. ప్రగతిభవన్​కు తప్పనిసరిగా పోదామని స్పష్టం చేశారు. లక్షలాది ప్రవీణ్​కుమార్​ల బతుకులు మార్చేందుకు... రెక్కాడితేకాని దొక్కాడని వారికోసం... ఐపీఎస్​ పదవిని వదులుకున్నానన్నారు. ఎంపీ రఘురామకృష్ణరాజు తనపై ఎన్నో ఆరోపణలు చేశారని అన్నారు. 'మేము చదువుకుంటే మీకు కళ్లు మంటా' అని రఘురామను ప్రవీణ్​కుమార్ ప్రశ్నించారు. మన మీద అనేక కుట్రలు జరుగుతున్నాయని వాటిని అడ్డుకొనేందుకే రాజకీయాల్లోకి వస్తున్నానని స్పష్టం చేశారు.

'అయ్యా సీఎంగారు మీరు దళిత బంధు కోసం రూ.1,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అవి ఎవరి పైసలు.. మా గిరిజన, ఆదివాసీ బిడ్డలు వ్యవసాయం చేసిన డబ్బులు, ఆదివాసి బిడ్డలు తేనె అమ్మిన సొమ్ములు, మా నేత కార్మికులు మగ్గాలు నేసి తీసుకొచ్చిన డబ్బులు.. మీరు విచ్చల విడిగా ఖర్చుచేస్తున్నారు. నిజంగా మీకు ప్రేముంటే.. మీ ఆస్తులమ్మి పెట్టండి. మా బతుకులు బాగుపడాలంటే, నాణ్యమైన విద్య, వైద్యం కావాలి. మీరు 1,000 గురుకులాలు పెట్టి.. మొత్తం మారిపోయిందని చెబుతున్నారు. గురుకులాల్లో కేవలం నాలుగు లక్షల మందే చదువుతున్నారు. దాంతో ఏ రకంగా బంగారు తెలంగాణ సాధ్యమో చెప్పండి.'

-ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​

'ప్రైవేటు యూనివర్సిటీలు పెట్టి ఏం సాధించారు..?'

విశ్వవిద్యాలయాల్లో ఐదేళ్లుగా రిక్రూట్​మెంట్​ లేదని ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ తెలిపారు. 2014 నుంచి ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారని ప్రశ్నించారు. మంచిగా నడుస్తున్న గురుకులాలకు అధికారులు, నేతలు వస్తున్నారని.. బహుజనులు చదువుతున్న విశ్వవిద్యాలయాలకు ఎందుకు రావడం లేదన్నారు. ప్రైవేటు యూనివర్సీటీలు పెట్టి మీరు ఏం సాధించారని నిలదీశారు. అసలు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు ఎందుకు రాకూడదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉస్మానియా ఆస్పత్రి లాంటివి.. హైదరాబాద్​లో ఇంకా నిర్మిస్తామని కేసీఆర్​ చెప్పారని... మాటల గారడీతో సుమారు ఏడు సంవత్సరాలుగా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. యాసలు మాట్లాడి వాసాలు లెక్కపెడుతున్నారని ఆరోపించారు.

ఇదీచూడండి:RS PRAVEEN KUMAR: నల్గొండ సభలో బీఎస్పీలో చేరిన ఆర్​ఎస్​ ప్రవీణ్‌కుమార్‌

Last Updated : Aug 9, 2021, 3:58 PM IST

ABOUT THE AUTHOR

...view details