Uttam kumar reddy on Grain purchase: వరి ధాన్యం కొనుగోళ్లు, గిరిజనుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఏపీలో గిరిజన విశ్వవిద్యాలయం విషయంలో ముందుకుపోతున్నా.. తెలంగాణ ప్రభుత్వం భూ కేటాయింపుల్లో అలసత్వం వల్లే.. వర్సిటీ ఏర్పాటు ఆలస్యం అవుతోందని.. లోక్‌సభలో కేంద్రం జవాబిచ్చిందని ఉత్తమ్ తెలిపారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే గిరిజన యూనివర్సిటీ ఆలస్యమవుతోందని ఆరోపించారు. భాజపా, తెరాసకు గిరిజనుల పట్ల ఎంత ఆసక్తి ఉందో దీనిద్వారా స్పష్టమవుతోందని విమర్శించారు.
తెలంగాణ వరి రైతులకు తెరాస, భాజపా ప్రభుత్వాలు శాపంగా మారాయని ఉత్తమ్ విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లపై తెరాస, భాజపా నాటకాలాడుతూ రైతులను గోస పెడుతున్నాయని ధ్వజమెత్తారు. యాసంగి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.
Uttam on farm laws:వ్యవసాయ చట్టాల రద్దుపై కాంగ్రెస్ చర్చకు పట్టుబట్టినా.. ఎలాంటి చర్చ లేకుండానే సాగు చట్టాల రద్దు బిల్లులను లోక్‌సభలో ఆమోదించారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఇది దురదృష్టకర పరిణామమన్నారు.