తెలంగాణ

telangana

అర్ధరాత్రి హోంమంత్రికి అపరిచిత వ్యక్తి ఫోన్​కాల్.. ఎందుకో తెలుసా..!

By

Published : Sep 29, 2022, 4:53 PM IST

Updated : Sep 29, 2022, 5:43 PM IST

Stranger Phone Call to Home Minister
Stranger Phone Call to Home Minister

Stranger Phone Call to Home Minister: అర్ధరాత్రి హోంమంత్రి మహమూద్​ అలీకి ఓ అపరిచిత వ్యక్తి ఫోన్ చేశాడు. హోంమంత్రికి అర్థరాత్రి ఫోన్ కాల్ అంటే ఎంతో ముఖ్యమైన విషయమని అంతా అనుకుంటారు. కానీ సదరు వ్యక్తి ఏ విషయం గురించి అడిగాడో తెలిస్తే అవాక్కవుతారు. పాతబస్తీలో హోటళ్లు రాత్రి 11లేదా 12 వరకు మాత్రమే తెరిచేలా చూడాలన్నది ఆ వ్యక్తి డిమాండ్. అర్థరాత్రి జరిగిన ఈ సంభాషణ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

Stranger Phone Call to Home Minister: పాతబస్తీలో హోటళ్లు ఎప్పటి వరకూ తెరిచి ఉంచాలనే దానిపై ఓ అపరిచిత వ్యక్తి అర్ధరాత్రి హోంమంత్రికి చేసిన ఫోన్ కాల్​ సంభాషణ కలకలం రేపుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నగరంలోని పాతబస్తీలో హోటళ్లను రాత్రి 11 లేదా 12 వరకు తెరిచేలా చూడాలని ఆ వ్యక్తి హోంమంత్రికి ఫోన్​ కాల్​లో విజ్ఞప్తి చేశాడు. సామాజిక మాధ్యమాల్లో హోటళ్లు రాత్రి ఒంటి గంట వరకు ఓపెన్​ చేసి ఉంటాయనే వార్త వైరల్​ అవుతోందని హోంమంత్రికి తెలిపాడు. ఇలా తెరిచి ఉండడం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయని వాపోయాడు.

సదరు వ్యక్తి ఫోన్​ కాల్​కు హోంమంత్రి వివరణ ఇచ్చారు. అధికార యంత్రాంగం నిర్ణయించిన సమయ వేళల ప్రకారమే దుకాణాలు, హోటళ్లు తెరిచి ఉంటాయని తెలిపారు. ఉదయం నుంచి నిద్రించే వరకు పలు పనుల్లో నిమగ్నమై ఉంటామని.. రాత్రి వేళల్లో ఇలా ఫోను చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయని తెలిపారు. అర్థరాత్రి ఫోన్ చేసి ఇలాంటి విషయాలు అడగడం సబబు కాదని మంత్రి సదరు వ్యక్తికి చెప్పారు. చివరగా ఆ వ్యక్తి అర్ధరాత్రి 1 వరకు అంటే ఇబ్బందులు ఎదురవుతాయని.. రాత్రి 11 గంటల వరకే హోటల్స్ తెరిచి ఉంచేలా అనుమతులు ఇవ్వాలని కోరాడు.

మొత్తానికి అర్థరాత్రి బిర్యాని వ్యవహారం హోంమంత్రి నిద్రకు భగ్నం చేసింది. మరోవైపు బిర్యానీ పాయింట్ల సమయాన్ని రాత్రి ఒంటిగంట వరకు తెరిచి ఉండాలని ఎంఐఎం నేతలు కోరడం కొసమెరుపు.

అర్ధరాత్రి హోంమంత్రికి అపరిచిత వ్యక్తి ఫోన్​కాల్.. ఎందుకో తెలుసా..!

ఇవీ చదవండి:

Last Updated :Sep 29, 2022, 5:43 PM IST

ABOUT THE AUTHOR

...view details