తెలంగాణ

telangana

ETV Bharat / city

Viveka Murder Case: ఎర్ర గంగిరెడ్డి బయటుంటే దర్యాప్తునకు విఘాతం: సీబీఐ

Viveka Murder Case: వైఎస్​ వివేకా హత్య కేసులో నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్​ రద్దు పిటిషన్​పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఎర్ర గంగిరెడ్డి బయట ఉంటే సాక్ష్యులను ప్రభావితం చేస్తారని.. సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

high court
high court

By

Published : Mar 15, 2022, 5:22 PM IST

Viveka Murder Case: ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ.. సీబీఐ దాఖలు చేసిన పిటిషన్​పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఎర్ర గంగిరెడ్డి, ఆయన అనుచరులు సాక్షులను తీవ్రంగా బెదిరిస్తున్నారని సీబీఐ తరఫు న్యాయవాది చెన్నకేశవులు ఏపీ హైకోర్టులో వాదనలు వినిపించారు.

ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ ఆదేశాల మేరకు.. దిగువ కోర్టు గంగిరెడ్డికి బెయిలిచ్చింది ఎప్పుడు..? దాన్ని రద్దు చేయాలని సీబీఐ కింది కోర్టులో పిటిషన్‌ వేసింది ఎప్పుడు...? దానిని ఆ కోర్టు కొట్టేసిందెప్పుడు..? అంటూ బెదిరింపులకు పాల్పడ్డట్టు ఇచ్చిన వాంగ్మూలాల వివరాలను సీబీఐ తరఫు న్యాయవాది హైకోర్టు ముందుంచారు. గంగిరెడ్డి బయటుంటే దర్యాప్తునకు విఘాతం కలుగుతోందని, బెయిలు రద్దు చేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం.. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

ఇదీచూడండి:Viveka Murder: వైఎస్‌ వివేకా హత్య జరిగి నేటికి మూడేళ్లు.. దర్యాప్తులో ఎన్నో మలుపులు!

ABOUT THE AUTHOR

...view details