దేశీయ ఎంటర్టైన్మెంట్ మీడియా వ్యాపారంలో భారీ ఒప్పందం జరిగింది. జీ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్, సోనీ పిక్చర్స్‌తో విలీన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందుకు జీ ఎటర్టైన్మెంట్.. బోర్డు ప్రాథమికంగా ఆమోద ముద్ర వేసింది.
ఈ ఒప్పందంతో ఇరు కంపెనీలు లీనియర్ నెట్‌వర్క్‌లు, డిజిటల్ ఆస్తులు, నిర్మాణ వ్యవహారాల వంటివి ఒక చోటుకు చేరనున్నాయి. ఇందులో సోనీ పిక్చర్స్ 1.57 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. విలీనం తర్వాత ఏర్పడే కొత్త సంస్థలో సోని పిక్చర్స్‌కు 52.93 శాతం వాటా, జీ ఎంటర్టైర్మెంట్ చేతికి 47.07 శాతం వాటా దక్కనున్నట్లు తెలుస్తోంది.