Health insurance policy: వైద్య బీమా పాలసీ కొనుగోలు చేసినప్పుడు.. ఆరోగ్య సంరక్షణ కోసం కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను బీమా సంస్థలు తీసుకొస్తున్నాయి. వీటిని ఎలాంటి అదనపు భారం లేకుండా అందిస్తున్నాయి. మంచి అలవాట్లతో ఆరోగ్యకరమైన జీవితాన్ని సొంతం చేసుకునేందుకు ప్రేరణ కలిగిస్తున్నాయి.
వ్యాయామం చేస్తే రాయితీ..
Discount in insurance premium: పాలసీదారులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వ్యాయామం, నడక, పరుగు, సైకిల్ తొక్కడం వంటివి చేసినప్పుడు వారికి బీమా సంస్థలు కొన్ని రివార్డు పాయింట్లను కేటాయిస్తాయి. వీటి ఆధారంగా పునరుద్ధరణ వేళలో ప్రీమియంలో రాయితీని అందిస్తున్నాయి. ఔట్ షేషెంట్ కన్సల్టేషన్లు, వైద్య పరీక్షలు, ఔషధాల బిల్లులో రాయితీ కోసమూ వీటిని వాడుకోవచ్చు. కొన్ని బీమా సంస్థలు ఈ పాయింట్లను పలు ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వినియోగించే వెసులుబాటునూ కల్పిస్తున్నాయి.
కోచ్‌ల సహాయంతో..
Reward points on insurance: కొన్ని బీమా సంస్థలు పాలసీదారుల కోసం ప్రత్యేకంగా వెల్‌నెస్ కోచ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. వీరు ఆహారం, వ్యాయామం, మానసిక ఆరోగ్యం, శరీర బరువు నిర్వహణ ఇలా పలు అంశాల్లో పాలసీదారులకు ఎప్పుటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తుంటారు. కోచ్‌లు సూచించిన విధంగా నడుచుకున్న వారికి బీమా సంస్థలు రివార్డు పాయింట్లను కేటాయిస్తాయి. దీంతోపాటు ఇతర కొన్ని ప్రయోజనాలూ అందిస్తున్నాయి.
ఇదీ చూడండి:వాహన బీమా విషయంలో ఈ పొరపాట్లు చేస్తున్నారా?