రత్నాలు, ఆభరణాల తయారీ, ఎగుమతుల రంగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ మేరకు రానున్న బడ్జెట్లో బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని ప్రతిపాదనలు చేసింది కేంద్ర వాణిజ్య శాఖ. ఈ నిర్ణయంతో బంగారం ధరలు దిగిరానున్నాయి.
12.5 నుంచి 4 శాతానికి..
ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్లో దిగుమతి సుంకాన్ని ప్రస్తుతం ఉన్న 12.5 శాతం నుంచి 4 శాతానికి తగ్గించాలని వాణిజ్య శాఖ కోరిందిని అధికార వర్గాలు వెల్లడించాయి.
పడిపోయిన దిగుమతులు
నవంబర్లో 152 టన్నులుగా ఉన్న బంగారం దిగుమతులు డిసెంబర్ నాటికి 39 టన్నులకు పడిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-నవంబర్ మధ్య కాలంలో దేశంలో బంగారం దిగుమతులు 7 శాతం తగ్గి 20.57 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో పసిడి దిగుమతులు 22.16 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.