తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వాట్సాప్​లో బ్లాక్ చేశాడని.. ప్రియుడి ఇంటి వద్దే యువతి ఉరి

Whatsapp block suicide: మహారాష్ట్రలో ఓ యువతి చిన్న విషయానికే ఆత్మహత్య చేసుకుంది. బాయ్​ఫ్రెండ్ వాట్సాప్​లో బ్లాక్ చేశాడని ఉరేసుకొని మరణించింది. ప్రియుడి ఇంటి వద్దే ప్రాణాలు తీసుకుంది. అసలు వివాదం ఎలా మొదలైందంటే...

whatsapp block suicide
whatsapp block suicide

By

Published : May 19, 2022, 5:55 AM IST

Whatsapp block suicide: బాయ్​ఫ్రెండ్ తన నెంబర్​ను వాట్సాప్​లో బ్లాక్ చేశాడని మహారాష్ట్ర ముంబయి సమీపంలోని దహీసర్​లో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. చిన్న వాగ్వాదం కారణంగా యువకుడు ఆమెను వాట్సాప్​లో బ్లాక్ చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన యువతి.. రైల్వే ట్రాక్ పక్క ఉన్న యువకుడి ఇంటి వద్దే ఉరేసుకొని ప్రాణాలు తీసుకుంది. మరణించిన ఆ యువతిని ప్రణాళి లోకడే(20)గా గుర్తించారు పోలీసులు. సోమవారం ఉదయం ఆమె చనిపోయిందని చెప్పారు.

"యువకుడి(27)తో మృతురాలికి ఆరేళ్లుగా పరిచయం ఉంది. గత ఆదివారం ఇద్దరు కలిసి ఓ వివాహానికి హాజరయ్యారు. ఆ తర్వాత యువకుడి ఇంటికి వెళ్లాలని ప్రణాళి పట్టుబట్టింది. అయితే, ఆ యువకుడు మాత్రం ఆమె అభ్యర్థనను తిరస్కరించాడు. ఇంటికి వెళ్లిపోవాలని సూచించాడు. ఆమె అలాగే వెళ్లిపోయింది. అయితే, పదేపదే ఫోన్ చేసి ఇంటికి వస్తానని యువకుడిని బతిమిలాడింది. రాత్రి అయింది కాబట్టి.. వద్దని చెప్పిన ఆ యువకుడు.. వాట్సాప్​లో నెంబర్​ను బ్లాక్ చేశాడు. దీంతో అప్పుడే ఇంట్లో నుంచి బయల్దేరి యువకుడి వద్దకు వచ్చింది ప్రణాళి. రాత్రి అతడితోనే ఉంది. ఉదయం లేచి చూసేసరికి సీలింగ్​కు దుపట్టాతో ఉరేసుకొని కనిపించింది" అని పోలీసులు వెల్లడించారు.

యువకుడు ఉదయం లేచి షాక్​కు గురయ్యాడని పోలీసులు చెప్పుకొచ్చారు. ప్రాథమిక సమాచారం ప్రకారం రైల్వే పోలీసులు ప్రమాదవశాత్తు మరణంగా నమోదు చేసుకున్నారు. ఘటనాస్థలిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details