రాజస్థాన్ జైపుర్‌లో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై.. తన క్లాస్మేట్, మరో యువకుడు కలిసి అత్యాచారం చేశారు. అవమానానికి గురైన బాలిక.. ఆదివారం రాత్రి 1 గంట సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అంతకుముందు బాలికపై అత్యాచారం జరిగిందంటూ ఆమె బంధువు వీడియో తీసి పోస్ట్ చేశారు. ఈ ఘటనపై మాల్పురా పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు అతడి బంధువు.
ఆ వీడియోలో ఏం ఉందంటే.. "బాలిక పరిస్థితి చూడండి ఎలా ఉందో. ఆడపిల్లపై జరిగిన ఈ అన్యాయానికి నేను తీవ్రంగా బాధపడుతున్నాను. ఈ ఘటనపై మాల్పురా స్టేషన్లో కేసు నమోదు చేశాను. మైనర్‌తో పాటు చదువుతున్న పదో తరగతి అబ్బాయి, మరో యువకుడితో బాలిక స్నేహం చేసింది. అయితే వారు బాలికను మోసం చేసి.. బుధవారం గ్యాంగ్ రేప్ చేశారు. ఆడ పిల్లలను చదివించి ముందుకు తీసుకు రండి అంటారు.. బయట ఇలాంటి పరిస్థితులు జరుగుతుంటే అది ఎలా సాధ్యమవుతుంది. నాకు చదవడం, రాయడం రాదు అందుకే ఈ వీడియో తీస్తున్నాను. నిందుతులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను. బాలికకు న్యాయం జరిగేలా చూడండి" అని వీడియోలో ఉంది.
దళిత యువతిపై దారుణం..బిహార్‌లో దళిత బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. గయాలో నివసిస్తున్న ఓ అమ్మాయి.. బహిర్భూమి కోసం వెళ్లింది. అమ్మాయి రోడ్డుపై వెళ్తుండగా.. నలుగురు వ్యక్తులు వచ్చి బలవంతంగా పొలాల్లోకి లాక్కుపోయి అత్యాచారం చేశారు. ఈ విషయం ఎవరికైనా చెపితే చంపేస్తామని బెదిరించారు. తిరిగి ఇంటికి చేరిన యువతి జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. వెంటనే వారు గయాలోని గురారు మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో రాజేశ్ కుమార్‌తో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశామని.. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు.
లఖ్‌నవూలో దారుణం.. నలుగురు వ్యక్తులు కలిసి తనపై అత్యాచారం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది 55 ఏళ్ల మహిళ. ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూలోని ఓ ఆశ్రమంలో జరిగిందీ దారుణం. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ ఆశ్రమానికి చెందిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు.. గోమతినగర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ దినేష్ మిశ్రా తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రయాగ్‌రాజ్ ప్రాంతానికి చెందిన 55 ఏళ్ల మహిళ లఖ్‌నవూలోని ఓ ఆశ్రమంలో ఉంటుంది. అక్టోబర్ 4న ఆమెకు మత్తుమందు ఇచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లినప్పుడు అత్యాచారం చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దుర్వాస్, ఛోట్టే మౌని, బర్హే మౌని, మన్మోహన్ అనే నలుగురు వ్యక్తులు తనపై అత్యాచారం చేసి.. ఎవరికైనా చెప్తే చంపుతామని బెదిరించారని ఆమె ఆరోపించింది. దీనిపై పూర్తి విచారణ జరుపుతున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రాచీ సింగ్ తెలిపారు.