దేశ ప్రజలందరికీ ఓనం పండుగ శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇది సామరస్యానికి ప్రతీకగా జరుపుకొనే ప్రత్యేక పండుగ అని ట్వీట్ చేశారు. ఆదివారం జరిగిన మన్కీబాత్ కార్యక్రమంలో ఓనం గురించి ప్రస్తావించినట్లు గుర్తు చేస్తూ వీడియే షేర్ చేశారు.
"ప్రజలకు ఓనం శుభాకాంక్షలు. సామరస్యానికి ప్రతీకగా జరుపుకొనే ప్రత్యేక పండుగ ఇది. నిరంతరం శ్రమించే రైతులకు కృతజ్ఞతలు తెలిపే సందర్భమిది. అందరూ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలి."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
ఓనం పండుగ గొప్ప సాంస్కృతిక వారసత్వానికి చిహ్నమని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు. కొత్త పంట రాకతో ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే సందర్భమిదన్నారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలని ప్రజలకు సూచించారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ప్రజలకు ఓనం పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గొప్ప రాజు మహాబలి స్వాయత్తం చేసుకున్న నిజాయతీ, సమగ్రత, కరుణ, నిస్వార్థం, త్యాగం విలువలను ఓనం సందర్భంగా గుర్తు చేసుకోవాలని ట్వీట్ చేశారు.
ఓనం పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, సామరస్యం, ఆరోగ్యం, శ్రేయస్సును తీసుకురావాలని హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.
ఇదీ చూడండి: ఆన్లైన్ ఓనం: వేడుకల్లో అబ్పురపరిచిన చిన్నారులు