కేరళలో కరోనా ఇంకా అదుపులోకి రాలేదు. తాజాగా మరో 25,010 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా మరో 177 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 22,303కు చేరింది. పాజిటివిటీ రేటు ప్రస్తుతం 16.53 శాతంగా ఉంది. కేరళలో 2,37,643 క్రియాశీల కేసులు ఉన్నాయి.
మరోవైపు మహారాష్ట్రలో కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 4,154 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మరో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 4,524మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
మిగతా రాష్ట్రాల్లో ఇలా..
- తమిళనాడులో కొత్తగా 1,631 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. మరో 1,523మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 25మంది మృతిచెందారు.
- మిజోరాంలో మరో వెయ్యి కేసులు నమోదయ్యాయి. అందులో 185 మంది చిన్నారులు ఉన్నారు. కొవిడ్ ధాటికి ఒక వ్యక్తి మరణిచాడు. మిజోరాంలో రోజూవారి కరోనా పాజిటివిటీ రేటు 10.77గా ఉంది.
- బంగాల్లో తాజాగా 753 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మరో 766 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. కొవిడ్ కారణంగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు.
- కర్ణాటకలో కొత్తగా 967 మంది వైరస్ సోకింది. మరో 10 మంది మృతిచెందారు.