ఆంధ్రప్రదేశ్

andhra pradesh

YCP councillors Protest in Kuppam కుప్పం పురపాలిక కార్యాలయానికి తాళం వేసిన వైసీపీ నేతలు.. అభివృద్ది నిధులు కేటాయించాలంటు ఆందోళన!

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 25, 2023, 4:16 PM IST

YCP councillors Protest in Kuppam

YCP councillors Protest in Kuppam: అధికార  వైసీపీకి చెందిన నేతలు అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించమంటూ రోడ్డుపైకి రావడమో, లేదా ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేయడమో పరిపాటిగా మారింది. తాజాగా... చిత్తూరు జిల్లా కుప్పంలోని వార్డుల్లో అభివృద్ధి పనులు జరగట్లేదంటూ... కుప్పం ముల్సిపాలిటీలో వైసీపీ కౌన్సిలర్లు ఆందోళన చేపట్టారు. కార్యలయంలో విధులు నిర్వహిస్తున్న  సిబ్బందిని బయటకు పంపారు. అనంతరం పురపాలిక కార్యాలయానికి తాళం వేశారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 9వార్డుల కౌన్సిలర్లు, కుటుంబ సభ్యులు కార్యాలయం వద్ద నిరసనలో పాల్గొన్నారు. వార్డుల్లో పనులు జరగక అనేక  ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు అభివృద్ధి పనులపై ప్రశ్నిస్తున్నారని కౌన్సిలర్లు పేర్కొన్నారు.  వారికి సమాధానం చెప్పలేక పాట్లు నానా పడుతున్నామని, ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు  పురపాలక కార్యాలయం వద్దకు చేరుకున్నారు. సమస్యలు ఉంటే ప్రభుత్వ కార్యలయానికి  తాళం ఎలా వేస్తారని ప్రశ్నించారు. తమ సమస్యలను సైతం చెప్పుకోలేని స్థితిలో ఉన్నామంటూ కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలపై  కమిషనర్, ఛైర్మన్ స్పందించాలని కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. చివరకు పోలీసులు వారికి  నచ్చజెప్పడంతో నిరసన విరమించారు. 

ABOUT THE AUTHOR

...view details