ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రతిపక్ష పార్టీ సానుభూతి పరుల ఓట్లు లక్ష్యంగా వైసీపీ అక్రమాలు- ఫేక్ ఓటరు ఐడీతో తొలగింపు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 29, 2023, 12:28 PM IST

Votes_Delation_with_Fake_Voter_ID

Votes Delation with Fake Voter ID: ప్రతిపక్ష పార్టీ సానుభూతి పరుల ఓట్ల తొలగింపే లక్ష్యంగా అధికార పార్టీ నాయకులు అక్రమాలు కొనసాగిస్తున్నారు. అనంతపురం నగరంలో నకిలీ ఓటర్ ఐడీతో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులైన 60 మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు వైసీపీ నేతలు ఫారం 7 దరఖాస్తు చేశారు. గతంలో అనంతపురం నగరంలో నివాసమున్న జింకా రాఘవేంద్ర అనే యువకుడు.. రెండేళ్ల కిందట శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువుకు వలస వచ్చి అక్కడే స్థిరపడ్డాడు. విషయం గుర్తించి రాఘవేంద్ర ప్రమేయం లేకుండా అతడి పేరిట 60 ఓట్ల వరకు ఫారం 7 దరఖాస్తు చేశారు. తన గుర్తింపు కార్డుతో దరఖాస్తు చేసిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాఘవేంద్ర కోరుతున్నారు.

"నకిలీ ఓటరు ఐడీతో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఫారం 7 దరఖాస్తు చేశారు. నా ఓటు తొలగించేందుకు కుట్ర చేశారు. దీనికి బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను." - జింకా రాఘవేంద్ర , బాధితుడు 

ABOUT THE AUTHOR

...view details