ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'జగన్ గాలిలో కొట్టుకు వచ్చారే తప్ప జనం నమ్మి గెలిపించలేదు - కూల్చివేతలే వారి సంస్కృతి'

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 20, 2023, 7:02 PM IST

thikka_reddy_fires_on_mla_balanagireddy

Thikka reddy Fires On MLA Balanagireddy : కర్నూలు జిల్లా మంత్రాలయంలో టీడీపీ జెండాలు తీసేసి దిమ్మలకు రంగులు వేయడం వైసీపీ సంస్కృతా అంటూ తెలుగుదేశం నేత తిక్కారెడ్డి మండిప‌డ్డారు. మాధవరం గ్రామంలో టీడీపీ జెండాను తొలగించి వైసీపీ జెండా ఎగురవేయడంతో తెలుగుదేశం శ్రేణులు ఆందోళన చేపట్టారు. దీంతో కొత్తగా జెండా దిమ్మెను ఏర్పాటు చేసి తెలుగుదేశం జెండా ఆవిష్కరించారు. తమ పార్టీ జెండా రెపరెపలాడటంతో తెలుగుదేశం కార్యకర్తలు టపాసులు కాలుస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. దీనిలో భాగంగా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, జగన్ గాలిలో కొట్టుకు వచ్చారే తప్ప ప్రజలు నమ్మి గెలిపించలేదని తెలుగుదేశం నేత తిక్కారెడ్డి ఆరోపించారు.

TDP Flag Issue In Kurnool : వైనాట్​​ జగన్మోహన్​రెడ్డి అనే కార్యక్రమం పెట్టి టీడీపీ జెండా తీసెయ్యడం సరైనది కాదు. యథారాజా తథా ప్రజా..  ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి జెండాలు తొలగించి వర్గపోరు పెట్టాలని తలచి ఇలాంటి పని చేశారు అన్నారు.

ABOUT THE AUTHOR

...view details