ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కలగానే పొట్టెపాళెం వంతెన నిర్మాణం - వర్షాలు కురిసినప్పుడల్లా ప్రజలకు తప్పని ఇబ్బందులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 8, 2023, 3:18 PM IST

Nellore_Potte_Palem_Bridge_Issue

Nellore Potte Palem Bridge Issue :  నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ పరిధిలోని పొట్టెపాళెం వంతెన దశాబ్దాలుగా కలగానే మిగిలిపోయింది. ఏటా వర్షాలు కురిసినప్పుడల్లా కలుజు దాటలేక ఐదు మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల మూడు రోజులపాటు పడిన వానలతో కలుజు పొంగి పొర్లుతోంది. నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం వంతెన నిర్మాణం చేయలేకపోవడంతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ముఖ్యమంత్రి జగన్ నిధులు కేటాయించలేదని తీవ్ర నిరసనలు తెలిపారు. ప్రస్తుతం మిగ్ జాం తుపాన్​తో కలుజు ప్రవాహం భారీగా ఉంది. 

ఐదు మండలాల ప్రజలు జిల్లా కేంద్రానికి ద్విచక్ర వాహనాలపై రాలేక రెండువైపులా ఆగిపోయాయి. అంబులెన్స్ లాంటి వాహనాలు వరద ఉద్ధృతికి కొట్టుకుపోతాయని భయపడుతున్నారు. దాదాపు 200 గ్రామాల ప్రజలు నెల్లూరు జిల్లా కేంద్రానికి రావాలంటే ఈ కలుజు మీదనే రావాల్సిన పరిస్థితి. కానీ చిన్నపాటి వర్షం వచ్చినా భారీగా ప్రవహిస్తోంది. ఈ సమస్య కారణంగా ఏడాది క్రితం మట్టి రోడ్డు నిర్మాణం చేశారు. ఇది కూడా భారీ వర్షానికి కొట్టుకుపోయింది. ఈ పరిస్థితి దాదాపు 15 సంవత్సరాలుగా ఉందని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వంతెనను నిర్మించాలని కోరుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details