ఆంధ్రప్రదేశ్

andhra pradesh

భూముల రీసర్వే - ఒప్పుకోని గ్రామస్థులు - వెనుదిరిగిన అధికారులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 8, 2023, 8:13 PM IST

land_survey_does_not_accept_villagers_in_kurnool_district

Land Survey Does Not Accept Villagers In Kurnool District:వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న భూముల రీసర్వే కార్యక్రమం వద్దని కర్నూలు జిల్లా హాలహర్వి మండలం బిలేహాల్ గ్రామస్థులు స్పష్టం చేశారు. కొంతకాలంగా  ప్రభుత్వం చేపడుతున్న రీ సర్వేను బిలేహాల్‌ రైతులు వ్యతిరేకిస్తున్నారు. పత్తికొండ ఆర్డీవో రామలక్ష్మి గ్రామాన్ని సందర్శించి రైతులతో సమావేశం నిర్వహించారు. గ్రామస్థులు సర్వేకు అంగీకారం తెలపాలని ఆమె కోరారు. 

ఆర్డీవో గ్రామస్థులతో సమావేశం నిర్వహించి ఒప్పించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. భూముల రీ సర్వేను రైతులు ఒప్పుకోవటం లేదని ఆమె తెలిపారు. భూసర్వే చేయటం వల్ల గ్రామానికి ఏదైనా ప్రాజెక్టు వచ్చినా మీ దగ్గర పత్రాలు ఉంటే భూములకు గుర్తింపు ఉంటుందని ఆమె అన్నారు. సర్వే చేశాక పత్రాలు కచ్చితంగా ఇస్తామని ఆర్డీవో పేర్కొన్నారు. తమకు సర్వేపై అనుమానాలున్నాయని అందువల్ల ఒప్పుకునే ప్రసక్తే లేదని గ్రామస్థులు చెప్పటంతో చేసేదేమీ లేక ఆర్డీవో అక్కడ నుంచి వెళ్లిపోయారు. 

ABOUT THE AUTHOR

...view details