ఆంధ్రప్రదేశ్

andhra pradesh

టీచర్‌ ఖాళీలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లెక్కల్లో ఏది నిజం?

By

Published : Mar 21, 2023, 8:59 PM IST

ప్రతిధ్వని

Prathidhwani: రాష్ట్రంలో టీచర్ పోస్టుల ఖాళీలు ఎన్ని? గడిచిన నాలుగు సంవత్సరాల్లో ఎంతమందిని కొత్తగా నియమించారు? ఎంతమంది రిటైర్ అయ్యారు? ఎంతమంది విద్యార్థులకు.. ఎంతమంది ఉపాధ్యాయులు ఉండాలి? ప్రస్తుతం అందర్నీ వేధిస్తున్న ప్రశ్నలు ఇవి. కొన్నిరోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో 50వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నట్లు స్వయంగా పార్లమెంట్‌లోనే ప్రకటించింది కేంద్రప్రభుత్వం. ఇప్పుడు అందుకు పూర్తి విరుద్ధమైన రీతిలో కేవలం వందల సంఖ్యలోనే టీచర్‌ వేకెన్సీలు ఉన్నట్లు చెబుతున్నాయి రాష్ట్ర విద్యాశాఖ లెక్కలు. అసలు ఈ రెండింటిలో ఏది నిజం..? ఇదే పరిస్థితి కొనసాగితే విద్యా ప్రమాణాల పరిస్థితి ఏమిటి?  అసలు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు ఎన్ని.. కేంద్ర, రాష్ట్ర.. విద్యాశాఖ గణాంకాలు ఏం చెబుతున్నాయి.  వైకాపా ప్రభు‌త్వం అధికారంలోకి వచ్చేసరికే 20వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నది ఉపాధ్యా య సంఘాలు చెప్పే మాట. మరి ఈ నాలుగేళ్లలో అవి వందల సంఖ్యలో ఎలా తగ్గాయి... అనే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చ. 

ABOUT THE AUTHOR

...view details