ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మంచి చేస్తే ప్రజల మధ్యకు వచ్చేందుకు భయమెందుకు జగన్​ ?: సత్య కుమార్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 16, 2023, 5:29 PM IST

BJP_Leader_Satya_Kumar_Fires_on_Jagan_Government

BJP Leader Satya Kumar Fires on Jagan Government: అబద్దపు ప్రకటనలు.. మాయమాటలతో రాష్ట్ర ప్రజలను సీఎం జగన్ మోసం చేస్తున్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్  వ్యాఖ్యానించారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు సుందరయ్య కాలనీలోని బీజేపీ నాయకులు గురువారం పర్యటించారు. ఈ పర్యటనలో బీజేపీలో 160 కుటుంబాలు  చేరడంతో.. సత్య కుమార్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్​కు కేంద్రం 25 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే.. వైసీపీ ప్రభుత్వం మూడున్నర లక్షల ఇళ్లు కట్టామని చెబుతోందని.. అవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదని మండిపడ్డారు. 

Satya Kumar Comments in YSR District: జగన్ నాలుగున్నర ఏళ్ల పాలనలో ప్రజల మంచికి కృషి చేయలేదు.. కాబట్టే ప్రజలకు భయపడి పరదాల చాటున, పోలీసుల బందోబస్తు మధ్య  తిరుగుతున్నారని విమర్శించారు. నిజంగా జగన్ ప్రభుత్వం ప్రజల భవిష్యత్  కోసం కృషి చేసి ఉంటే.. ప్రజల మధ్యకు రావడానికి భయమెందుకని ప్రశ్నించారు. ప్రజలకు సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేవని.. జగన్ మోహన్ రెడ్డి మాత్రం 5కిలోమీటర్లు ప్రయాణించాలంటే విమానంలో వెళ్తారని.. ప్రజల సొమ్మును ప్రభుత్వం ఈ విధంగా దుర్వినియోగం చేస్తుందని దుయ్యబట్టారు. పేదల కోసం కేంద్రం ఇస్తున్న బియ్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం  స్వాహా చేస్తుందని ఆరోపించారు.  

TAGGED:

ABOUT THE AUTHOR

...view details