ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Bear is Roaming in Mahanandi Temple Premises: మహానంది ఆలయ సమీపంలో ఎలుగుబంటి సంచారం.. భయాందోళనలో ప్రజలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 2, 2023, 2:04 PM IST

bear_is_roaming_in_mahanandi_temple_premises

Bear is Roaming in Mahanandi temple premises:నంద్యాల జిల్లా మహానంది ఆలయ సమీపంలో ఎలుగు బంటిని గుర్తించారు. ఆలయ అవరణలో టీటీడీ సత్రం కరివెన సత్రాల మీదుగా వెళుతున్న ఎలుగును గమనించిన స్థానికులు అరుపులు ఈలలు వేస్తూ తరిమారు. దీంతో పొలాల మీదుగా అడవిలోకి వెళ్లి ఉండవచ్చునని స్థానికులు భావిస్తున్నారు. వారం రోజుల క్రితం మహానంది సమీపాన ఈశ్వర్ నగర్​లో ఎలుగు బంటి సంచరించింది. ఎలుగు బంటి సంచారంతో స్థానికులు, భక్తులు ఆందోళన చెందుతున్నారు.

Another cheetah walk on the Tirumala walkway:తిరుమల నడక దారిలో మరో చిరుత సంచారం సంచలనంగా మారింది. అలిపిరి నడక మార్గం ఏడో మైలు వద్ద నరసింహ స్వామి ఆలయ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ చిరుత రెండు రోజులుగా సంచరించడాన్ని ట్రాప్​ కెమెరాలలో అటవీ శాఖ అధికారులు గుర్తించారు. గత నెలలో ఇదే ప్రాంతంలో బాలిక లక్షితపై ఓ చిరుత దాడి చేసి చంపేసిన విషయం తెలిసిందే.. టీటీడీ ప్రభుత్వ అటవీశాఖల ఆధ్వర్యంలో బోన్లు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 4 చిరుతలను పట్టుకున్నారు. తాజాగా మరో చిరుత సంచరించడాన్ని గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details