ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కొత్త హంగులతో ఏయూ ఆడిటోరియం.. విద్యార్థులే ఆర్టిస్ట్​, ఆర్కిటెక్చర్లు

By

Published : Jun 2, 2023, 5:36 PM IST

కొత్త హంగులతో ముస్తాబవుతున్న ఏయూ ఆడిటోరియం.. కొటి ఖర్చుతో విద్యార్థులే..!

Andhra University Open Auditorium: తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రధాన విశ్వవిద్యాలయాల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఒకటి. కొన్ని దశాబ్దాలుగా ఎందరో గొప్ప గొప్ప మేధావులు, రాజకీయ ప్రముఖులను తెలుగు నేలకు అందించిన ఘనత ఈ వర్సిటీ సొంతం. అంతటి ప్రాధాన్యత గల ఆ యూనివర్సిటీలో ఓపెన్‌ ఆడిటోరియానికి ఓ ప్రత్యేక చరిత్ర ఉంది. ఒకప్పుడు కళా ప్రదర్శనలకు చిరునామాగా ఉన్న ఆ ఆడిటోరియం.. ఆ తర్వాత ఎన్నో మంచి మంచి నిర్ణయాలు తీసుకునేందుకు వేదికైంది. అలాంటి ఆ ఓపెన్‌ ఆడిటోరియానికి ఇప్పుడు కొత్త హంగులు సమకూరుతున్నాయి. అందుకు ఆ కళాశాల విద్యార్థులే ఆర్టిస్ట్‌, ఆర్కిటెక్చర్లుగా మారి సందేశాత్మక చిత్రాలతో అధునాతన పెయింటింగ్స్ వేశారు. దాదాపు కొటి రూపాయలకు పైగా నిధులు, దాతల సహకారంతో దీనికి రూపురేఖలు ఆకర్షణీయంగా మారాయి. 

ఇదంతా ఒక ఎత్తయితే దీనిని చూపరులందరికి ఒక్కసారిగా ఆకట్టుకునేలా అధునాతన పెయింటింగ్స్ విద్యార్దులే స్వయంగా పాలుపంచుకొని తీర్చిదిద్దడం ఒక ప్రధానాంశం. నాట్యం, నాటకం, గాత్రం, వాయిద్యం, నాటిక ఇలా ఈ అంశాలన్నీ ఆధునికంగా ప్రతిబింబించేలా నేటి తరం వారు అలోచించేట్టుగా ఈ ప్రవేశ ద్వారం వద్ద పెయింటింగ్ రూపకల్పనలో భాగస్వామ్యం కల్పించింది.. అందరిని ఆకట్టుకునేలా ఆ ఆడిటోరియానికి కొత్త కళను జోడించిన యూనివర్శిటీ విద్యార్థులతో స్పెషల్‌ చిట్‌చాట్‌.

ABOUT THE AUTHOR

...view details