ఆంధ్రప్రదేశ్

andhra pradesh

SAJJALA ABOUT AVINASH: మీడియాపై అవినాష్ రెడ్డి అనుచరులు దాడి చేయలేదు: సజ్జల

By

Published : May 23, 2023, 9:38 PM IST

Sajjala reacted to the news of Kadapa MP Avinash Reddy arrest: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టుకు సంబంధించి.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా కర్నూలు ఎస్పీ అవినాష్ రెడ్డి అరెస్టు విషయంలో సీబీఐ అధికారులకు సహకరించడం లేదని సోషల్ మీడియాలో, పలు మీడియా సంస్థల్లో జరుగుతోన్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని, అవన్నీ ఊహాగానాలేనని ఆయన పేర్కొన్నారు. అవినాష్ రెడ్డి విషయంలో ఏదో అన్యాయం జరుగుతుందని భావించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అనుచరులు అక్కడికి (కర్నూలు) తరలివస్తున్నారని తెలిపారు. గతకొన్ని రోజుల క్రితం అవినాష్ రెడ్డి అనుచరులు మీడియాపై దాడి చేశారని జరుగుతున్న ప్రచారంలో కూడా వాస్తవం లేదని, మీడియా ప్రతినిధులపై ఎవ్వరూ దాడులు చేయలేదని సజ్ఞల చెప్పుకొచ్చారు.

కావాలనే తప్పుడు వార్తలు రాస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఈరోజు విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొందరు మీడియా సంస్థల ప్రతినిధులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లా పని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు వార్తలు, ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఈ విషయంపై ఎవరికో ఆవేశం వచ్చి ప్రశ్నించినందుకు.. దాన్ని మీడియాపై దాడిగా అభివర్ణిస్తున్నారని వ్యాఖ్యానించారు. 

అలాంటి రాతలు రాస్తే మీడియాపై కోపం రాదా..?: కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ విషయంలో జరుగుతున్న ప్రచారంపై కూడా సజ్ఞల స్పందించారు. అవినాష్ రెడ్డి ఎక్కడికో పరారవుతున్నారని కొందరు రాస్తున్న రాతలను చూస్తుంటే నవ్వాలో, ఏడ్వాల్లో అర్థం కావటం లేదన్నారు. అలాంటి తప్పుడు రాతలు రాస్తే మీడియాపై కోపం రాదా..? అని అన్నారు. అవినాష్ రెడ్డి ఇప్పటికే 6, 7సార్లు సీబీఐ విచారణకు హాజరయ్యారని, బాధ్యత కల్గిన ఎంపీగా విచారణ నుంచి ఎక్కడా తప్పించుకోలేదన్నారు. 

అవినాష్ ఎక్కడికి పారిపోలేదు.. ''వివేకా హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డి ఇదివరకే.. విచారణకు వచ్చేందుకు మరి కొంత సమయం ఇవ్వాలని సీబీఐని కోరాడు. ఆయన ఎక్కడికో పారిపోలేదు. ఆయన తల్లికి ఆరోగ్యం బాగోలేకపోతే కర్నూలులో ఉన్న విశ్వభారతి ఆస్పత్రికి వెళ్లి దగ్గరుండి చూసుకుంటున్నారు. అవినాష్ రెడ్డి ఇప్పటికే 6, 7సార్లు సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఈరోజు ఆయన బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 25న హైకోర్టుకు వెళ్లాలని అవినాష్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్రానికి కేంద్రం పదివేల కోట్లు ఇచ్చి పెద్ద ఊరట ఇచ్చిందని మీడియా సంస్థలు ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉంది. గతంలో రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం వల్ల ఈరోజు కేంద్రం తన బాధ్యతగా ఆ నిధులు ఇచ్చింది'' అని సజ్ఞల రామకృష్ణ అన్నారు. 

ABOUT THE AUTHOR

...view details