ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అయ్యప్ప మాలతో స్కూలుకు వచ్చాడని ఇంటికి పంపిన ఉపాధ్యాయుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

By

Published : Oct 29, 2022, 9:55 PM IST

Kadapa Pulivendula: అయ్యప్ప మాలతో స్కూలుకు వచ్చాడని ఓ విద్యార్థి ఉపాధ్యాయుడు మాల తీసి ఇంటికి పంపిన ఘటన కడప జిల్లాలో కలకలం రేపింది. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు, హిందు సంఘాలతో కలిసి పాఠశాల ఉపాధ్యాయుడిని నిలదీశారు. దీంతో ఆ టీచర్ చేసిన తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

Student Wearing Ayyappa Mala
అయ్యప్ప మాలధారణ

Teacher Not Allowed Student: గత కొద్ది కాలంగా దేశంలోని పాఠశాలల్లో వస్త్రాధారణపై గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి ఘటనే కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలంలోని బలపనూరులో చోటు చేసుకుంది. జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి అయ్యప్ప మాలధారణ చేసే స్కూలుకు హాజరయ్యాడు. దీంతో ఆగ్రహించిన సైన్సు టీచర్ రమణారెడ్డి.. మాలతో స్కూలుకు రావద్దని, మాల తీసేయాలని సూచించాడు. అంతేకాకుండా అయ్యప్ప మాలను స్వయంగా తీసేయించి విద్యార్థిని ఇంటికి పంపారు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు, హిందూ సంఘాలు స్కూలుకు వచ్చి సైన్సు ఉపాధ్యాయుడిని నిలదీశారు. తాను చేసింది తప్పు అంటూ విద్యార్థి తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పారు. దీంతో గొడవ సద్దుమణిగింది.

ABOUT THE AUTHOR

...view details