ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రేపు కడపకు నారా లోకేశ్‌.. స్థానిక నేతలకు పోలీసుల నోటీసులు

By

Published : Oct 17, 2022, 7:03 PM IST

Updated : Oct 17, 2022, 9:55 PM IST

Nara Lokesh Kadapa Tour: తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళవారం కడపలో పర్యటించనున్నారు. కడప జైల్లో ఉన్న ప్రొద్దుటూరు తెదేపా ఇన్‌ఛార్జ్‌ ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డిని ఆయన పరామర్శించనున్నారని.. పార్టీ వర్గాలు వెల్లడించాయి.

lokesh
lokesh

Nara Lokesh Kadapa Tour: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళవారం కడపలో పర్యటించనున్నారు. ఇటీవల అరెస్టయిన ప్రొద్దుటూరు తెదేపా ఇన్‌ఛార్జ్‌ ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డిని కడప జైల్లో పరామర్శించనున్నారు. హైదరాబాద్‌ నుంచి విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకుని నేరుగా కడప కేంద్ర కారాగారానికి రోడ్డు మార్గంలో వెళ్లనున్నారు. రాళ్లదాడి కేసులో రిమాండ్‌లో ఉన్న ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డితో పాటు.. కార్యకర్తలను పరామర్శించి ప్రొద్దుటూరు వెళ్తారు. అక్కడ ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి కుటుంబసభ్యులను పరామర్శిస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

లోకేశ్ పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చేయవద్దని సూచిస్తూ కడప రిమ్స్ పోలీసులు తెదేపా నేతలకు నోటీసులు ఇస్తున్నారు. పర్యటనలో పోలీసుల ఆంక్షలు ఉల్లంఘిస్తే.. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు.

ఇవి చదవండి:

Last Updated :Oct 17, 2022, 9:55 PM IST

ABOUT THE AUTHOR

...view details