ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'జాబ్ క్యాలెండర్'పై ధర్నా... కడపలో విద్యార్థి నాయకులు అరెస్ట్

By

Published : Jul 6, 2021, 9:57 PM IST

బూటకపు ఉద్యోగ క్యాలెండర్ ను రద్దు చేసి.. కొత్త ఉద్యోగ క్యాలెండర్ ను విడుదల చేయాలి.. అని డిమాండ్ చేస్తూ కడపలో విద్యార్థి సంఘ నాయకులు బైక్ ర్యాలీ చేపట్టారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. ఇరుపక్షాల మధ్య తోపులాట జరిగింది. చివరికి విద్యార్థి నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

Arrest of student union leaders
విద్యార్థి సంఘ నాయకుల అరెస్ట్

నూతన జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. కడపలో విద్యార్థి సంఘ నాయకులు బైక్ ర్యాలీ చేపట్టారు. వారిని స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు అరెస్టు చేసి తరలించారు.

సీఎం జగన్ ప్రభుత్వం యువతను నట్టేట ముంచేసిందని నేతలు వ్యాఖ్యానించారు. దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం 10 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామనడం దారుణమన్నారు. సీఎం కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుంటే భవిష్యత్తులో ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details