ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఒకే ఇంట్లో ముగ్గురికి పాముకాటు...బాలుడి మృతి

By

Published : Oct 13, 2020, 6:58 AM IST

ఒకే ఇంట్లో ఉంటున్న ముగ్గురు పిల్లలు పాము కాటుకి గురైన ఘటన కడప జిల్లా గాలివీడు మండల పరిధిలో జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా... మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

snake
snake

కడప జిల్లా గాలివీడు మండలం తూముకుంట పంచాయతీ దిగువకుంటలో విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న వేణుగోపాలనాయుడు, ఈశ్వరమ్మ దంపతుల ముగ్గురు పిల్లలు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పాము కాటేసింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. స్థానికులు పామును గుర్తించి చంపేశారు.

snake

ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామంలోకి వర్షపు నీరు చేరడంతో... విష పురుగులు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఒకే ఇంట్లో ముగ్గురు పాము కాటుకు గురి కావడం, ఒకరు మృతి చెందడంతో...ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details