ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఈతకు వెళ్లి ఐటీడీపీ ప్రధాన కార్యదర్శి.. ఇరువర్గాల ఘర్షణలో ఓ వ్యక్తి..!

By

Published : Apr 9, 2023, 10:24 PM IST

Man Killed In Clash Between Two Groups: వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం వీరపునాయనిపల్లి మండలం బసిరెడ్డి పల్లెలో విషాదం చోటు చేసుకుంది. పొలంలో నీటి నిలువ సంపులో ఈతకు వెళ్ళి నీటిలో మునిగి ఐటీడీపీ కడప పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి నరసింహ మృతి చెందాడు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఇద్దరు వ్యక్తుల మధ్య చెలరేగిన ఘర్షణ మరో వ్యక్తిని బలిగొంది.

Man Killed In Clash Between Two Groups
Man Killed In Clash Between Two Groups

Man dies in swimming pool: వైయస్సార్ కడప జిల్లా కమలాపురం వీరపునాయనిపల్లి మండలం బసిరెడ్డి పల్లెలో పొలంలో నీటినిలువ సంపులో ఈతకు వెళ్ళి ఐటీడీపీ కడప పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి నరసింహ మృతి చెందాడు. స్నేహితులతో కలిసి విందులో పాల్గొని సరదాగా ఈతకు వెళ్లిన నరసింహ మృతి నీటిలో మునిగి మృతి చెందినట్లు స్థానికులు పేర్కొన్నారు. కడప జిల్లా ఐటీడీపీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న నరసింహ మృతి పట్ల పలువురు టీడీపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. పార్టీలో చురుగ్గా పనిచేస్తున్న నరసింహ మృతి తీరని లోటు అని విచారం వ్యక్తం చేశారు. నరసింహ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కమలాపురం మండలం పెద్దచెప్పలి గ్రామానికి చెందిన నరసింహకు భార్య, పాప ఉన్నారు. సోషల్ మీడియాలో చురుగ్గా పనిచేస్తూ పార్టీ కార్యక్రమాలు అన్నింట ముందుండి పని చేస్తూ ఉండేవాడని టీడీపీ నేతలు పేర్కొన్నారు. ఇటీవల కాలంలో సేవలను గుర్తించిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం జిల్లా ఐటీడీపీ ప్రధాన కార్యదర్శిగా నియమించారని టీడీపీ నేతలు తెలిపారు.

పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం ఎన్​కే రాజపురం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణలో మరో వ్యక్తి మృతి చేందిన ఘటనలో ఎన్​కే రాజపురం విషాదఛాయలు అలుముకున్నాయి. శివశంకర్ (20) మోహన్ రావు(21) అనే ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ క్రమంలో చందక శివశంకర్ తాగిన మైకంలో మోహన్ రావుపై దాడి చేశాడని కుంటంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దాడిచేయడమే కాకుండా శివశంకర్​తో పాటుగా ఆయన కుటంబసభ్యులు మోహన్ రావు ఇంట్లోకి ప్రవేశించిన మోహన్ రావు ఇంట్లో వస్తువులను ధ్వంసం చేసినట్లు స్థానికులు పేర్కొన్నారు. అడ్డువచ్చిన మోహన్ రావు తండ్రి చంద్రరావుపై దాడి చేశారని వెల్లడించారు. శివ శంకర్ కుటుబీకులు దాడిలో చంద్రరావుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి వెంటనే ఆయనను పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మొరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్ కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చంద్రరావు (52) మృతి చెందినట్లు వైద్యులు వెల్లడిచారు. చంద్రరావు మృతికి కారణమైన వారిని శిక్షించాలంటూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఘటన ప్రదేశానికి చేరుకున్నపోలీసులు మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details