ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వివేకా హత్య కేసులో అనూహ్య పరిణామం.. బెయిల్ పిటిషన్ వెనక్కి తీసుకున్న అవినాష్ రెడ్డి

By

Published : Mar 29, 2023, 10:50 PM IST

Updated : Mar 30, 2023, 6:29 AM IST

YS Vivekananda Reddy murder case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు మరో మలుపు తీసుకుంది. సీబీఐ.. కొత్త సిట్ అంశాన్ని తెరమీదకు తీసుకురాగా.. సుప్రీం నెల రోజుల గడువు ఇచ్చింది. కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇవాళ హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్​ ఉపసంహరించుకోవడం ఆసక్తిగా మారింది.

Etv Bharat
Etv Bharat

YS Vivekananda Reddy murder case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు మరో మలుపు తీసుకుంది. ఓ వైపు కేసులో ఏ 5 ముద్దాయి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి బెయిల్ కోరుతూ అతడి భార్య తులశమ్మ వేసిన పిటిషన్​ను సుప్రీం కోర్టు ఇవాళ విచారించింది. కేసును ఇంకా ఎన్నాళ్లు కొనసాగదీస్తారంటూ న్యాయమూర్తి ప్రశ్నించగా.. సీబీఐ.. కొత్త సిట్ అంశాన్ని తెరమీదకు తెచ్చింది. అంతేగాకుండా దర్యాప్తు అధికారి రాంసింగ్ ను తొలగిస్తూ కొత్త పేర్లతో సిట్ ను ప్రకటించింది. ఈ నేపథ్యాన సుప్రీం... నెల రోజుల గడువు ఇచ్చింది. ఏప్రిల్ 30 లోగా తేల్చాలని స్పష్టం చేసింది. మరో వైపు కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి... ఇవాళ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు.

బెయిల్ పిటిషన్ వెనక్కి... వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి... ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తన ముందస్తు బెయిల్ పిటిషన్ వెనక్కి తీసుకున్నాడు. వివేకా హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్‌ ను ఆయన ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు రిజిస్ట్రీ వద్ద పెండింగ్​లో ఉన్న పిటిషన్‌ను అవినాష్ రెడ్డి న్యాయవాది వెనక్కి తీసుకున్నారు. సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వుల నేపథ్యంలో అవినాష్​రెడ్డి పిటిషన్ వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది.

కొత్త సిట్ ఏర్పాటు... వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు అధికారిని మార్చాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. వివేకా హత్య కేసులో ఏ-5గా ఉన్న నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ పిటిషన్‌పై దర్యాప్తు అధికారి మార్పునకు సంబంధించి... సీబీఐ తన ప్రతిపాదనలను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ప్రస్తుత దర్యాప్తు అధికారి రామ్‌సింగ్‌ను కొనసాగిస్తూనే.. ఆయనతోపాటు మరో అధికారి పేరును సీబీఐ ప్రతిపాదించింది. రామ్‌సింగ్‌ కొనసాగింపులో అర్థం లేదని ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఆర్‌.షా వ్యాఖ్యానించారు. దర్యాప్తులో పురోగతి లేనప్పుడు రామ్‌సింగ్‌ కొనసాగింపు ఎందుకని సీబీఐని ప్రశ్నించారు. ఏప్రిల్‌ 15 నాటికి దర్యాప్తు పూర్తిచేస్తామని ధర్మాసనానికి సీబీఐ వివరణ ఇచ్చింది. కాగా, కొత్త సిట్, కొత్త అధికారుల రాకతో దర్యాప్తు ఆలస్యమవుతుందని, తులసమ్మ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. విచారణ ఆలస్యమవుతున్నందున శివశంకర్‌రెడ్డికి బెయిల్ ఇవ్వాలని కోరారు. ఇరువైపు వాదనలు విన్న సుప్రీంకోర్టు మధ్యాహ్నం 2 గంటలకు ఉత్తర్వులు జారీచేస్తామని తెలిపింది.

రామ్​సింగ్ తొలగింపు... అనంతరం సీబీఐ దాఖలు చేసిన నివేదికను కూడా పరిగణలోకి తీసుకున్నట్లు న్యాయస్థానం తెలియజేయగా... కొత్త సిట్‌ను నియమించాలంటూ సీబీఐ ప్రతిపాదన తెచ్చింది. కొత్తగా ఏర్పాటైన సిట్‌ బృందంలో ఎస్పీ వికాస్‌ సింగ్‌, అడిషనల్‌ ఎస్పీ ముఖేశ్‌ కుమార్‌ సహా ఇన్‌స్పెక్టర్లు ఎస్‌.శ్రీమతి, నవీన్‌ పునియా, అంకిత్‌ యాదవ్‌‌ ఉన్నారు. కొత్తగా ఏర్పాటైన సిట్.. సీబీఐ డీఐజీ కె.ఆర్‌.చౌరాసియా నేతృత్వంలో దర్యాప్తును కొనసాగిస్తుందని తెలిపింది. ప్రస్తుత దర్యాప్తు అధికారి రామ్‌సింగ్‌ను తప్పించినట్లు వివరించింది. కొత్త సిట్ ఏర్పాటు నేపథ్యంలో శివశంకర్ రెడ్డికి బెయిల్‌ను మంజూరు పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది.

ఇవీ చదవండి :

Last Updated : Mar 30, 2023, 6:29 AM IST

ABOUT THE AUTHOR

...view details