ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CHEATING CASE: బంగారు ఆభరణాల చేయిస్తామని.. పంగనామాలు పెట్టి..!

By

Published : Aug 18, 2021, 10:00 PM IST

Updated : Aug 18, 2021, 10:44 PM IST

ఆభరణాలు చేయిస్తామని చెప్పి డబ్బు, బంగారం తీసుకుని బంగారం దుకాణం నిర్వాహకులు ఉడాయించిన ఘటన.. కడప జిల్లా ప్రొద్దుటూరు ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. నకిలీ బంగారాన్ని కుదువ పెట్టి డబ్బులు తీసుకున్నారని గమనించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాదాపు 35 మందిపైగా బాధితులు మోసపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

CHEATING CASE
CHEATING CASE

కడప జిల్లా ప్రొద్దుటూరులో ఘరానా మోసం వెలుగుచూసింది. ఆభరణాలు చేయిస్తామని డబ్బు, బంగారం తీసుకుని బంగారం దుకాణం నిర్వాహకులు ఉడాయించారు. పట్టణంలోని ఓ బంగారం దుకాణం నిర్వాహకులు కలందర్, సికందర్​లకు.. మహమ్మద్ హనీఫ్ అనే వ్యక్తి బంగారం ఆభరణాలు చేయించుకునేందుకు 9 తులాల బంగారం ఇచ్చాడు. తదనంతర పరిచయంలో జనవరి 5న ఐదు లక్షలు అప్పుగా హనీఫ్ నుంచి డబ్బులు తీసుకున్నారు. జూలైలో బంగారం కుదవ పెట్టి మరోసారి హనీఫ్ వద్ద మరో రెండు లక్షలు తీసుకున్నారు. తాజాగా ఆ బంగారాన్ని హనీఫ్ పరీక్షించగా.. నకిలీ బంగారంగా తేలింది. దీంతో మోసపోయానని గమనించిన అతను.. చేసేదేమి లేక పోలీసులను ఆశ్రయించాడు. వీరితో పాటు ప్రొద్దుటూరులో ఇలా 35 మందికి పైగా బాధితులు ఉంటారని అంచనా వేస్తున్నారు. మొత్తం సుమారు రెండున్నర కిలోల వరకు మోసం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

'పట్టించుకోని పోలీసులు'..

గతనెల ప్రొద్దుటూరు ఒకటో పట్టణ పోలీసులను ఆశ్రయించిన బాధితులు.. కేసు నమోదైనా పోలీసులు వివరాలు బయటకు రానివ్వలేదని వాపోయారు. తమకు న్యాయం చేయాలంటూ ఇవాళ మరో మారు బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

Last Updated : Aug 18, 2021, 10:44 PM IST

ABOUT THE AUTHOR

...view details