ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జమ్మలమడుగు కోర్టులో ఉమాశంకర్​ రెడ్డి సతీమణి స్వాతి వాంగ్మూలం

By

Published : Mar 25, 2023, 8:08 PM IST

Swathi testified in court: గతంలో పులివెందులలో కొమ్మ పరమేశ్వర్‌రెడ్డి, ఆయన కుమారుడు సునీల్ కుమార్ రెడ్డి.. గజ్జల ఉమా శంకర్ రెడ్డి భార్య స్వాతితో గొడవపడి దాడి చేయగా.. స్వాతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరినీ.. అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ దాడి ఘటనపై స్వాతి జమ్మలమడుగు కోర్టులో మేజిస్ట్రేట్ ముందు సీఆర్‌పీసీ 164 సెక్షన్ కింద వాంగ్మూలం ఇచ్చారు.

jammalamadugu court
jammalamadugu court

Swathi testified in court: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏ-3 నిందితుడుగా ఉన్న గజ్జల ఉమా శంకర్ రెడ్డి భార్య స్వాతి.. జమ్మలమడుగు కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ఈ నెల 5వ తేదీన పులివెందులలో ఇంటి వద్ద ఉన్న స్వాతితో సింహాద్రిపురం మండలానికి చెందిన కొమ్మ పరమేశ్వర్ రెడ్డి ఆయన కుమారుడు సునీల్ కుమార్ రెడ్డి గొడవపడి దాడి చేశారు. ఈ ఘటనపై స్వాతి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పరమేశ్వర్ రెడ్డి ఆయన కుమారుడు సునీల్ కుమార్ రెడ్డి ఇద్దరినీ.. అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

ఈ నెల 5న జరిగిన ఘటనపై ఈ రోజు ఉమా శంకర్ రెడ్డి భార్య స్వాతి జమ్మలమడుగు కోర్టులో హాజరై మేజిస్ట్రేట్ ముందు సీఆర్‌పీసీ 164 సెక్షన్ కింద వాంగ్మూలం ఇచ్చారు. స్వాతితో పాటు ఉమా శంకర్ రెడ్డి తల్లి కాంతమ్మ, సోదరుడు జగదీశ్వర్ రెడ్డి కూడా వాంగ్మూలం ఇచ్చారు. ముగ్గురు వ్యక్తుల నుంచి మేజిస్ట్రేట్ వాంగ్మూలం తీసుకున్నారు. వివేకానంద రెడ్డిని ఏ విధంగా హత్య చేశారో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉమా శంకర్ రెడ్డిని అదే విధంగా చంపుతామని కొమ్మ పరమేశ్వర్ రెడ్డి బెదిరించినట్లు స్వాతి వాంగ్మూలంలో పేర్కొన్నారు. వాంగ్మూలం నమోదు చేసిన తర్వాత పోలీసుల బందోబస్తు మధ్య ముగ్గురిని జమ్మలమడుగు నుంచి పులివెందులకు తీసుకెళ్లారు.

ఏం జరిగిందంటే..వివేకానంద రెడ్డిని ఏ విధంగా హత్య చేశారో.. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత నీ భర్తను కూడా అదే విధంగా చంపుతాం" ఇది వివేకా హత్య కేసు నిందితుడు ఉమాశంకర్​ రెడ్డి భార్యకు గతంలో వచ్చిన బెదిరింపులు. కసునూరుకు చెందిన కొమ్మ పరమేశ్వర్ రెడ్డి గతంలో తనని బెదిరించాడని ఉమా శంకర్ రెడ్డి భార్య స్వాతి ఆరోపించారు. పులివెందులలో తన ఇంటి వద్దకు వచ్చిన పరమేశ్వర్ రెడ్డి.. బూతులు తిడుతూ అసభ్యకరంగా దుర్భాషలాడి హెచ్చరించాడని స్వాతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివేకానంద రెడ్డిని హత్య చేసి డబ్బులు తీసుకొని జల్సా చేస్తున్నారా అంటూ దుర్భాషలాడినట్లు ఆమె పోలీసులకు వివరించారు.

ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కొమ్మ పరమేశ్వర్ రెడ్డి చెప్పు తీసుకొని తనపై దాడికి యత్నించడమే కాకుండా సెల్​ ఫోన్ లాక్కొని కిందికి పడేశాడని ఆమె వాపోయారు. పరమేశ్వర్ రెడ్డి వెంట ఆయన కుమారుడు కూడా వచ్చాడని ఆమె తెలిపారు. తనకు దెబ్బలు తగలడంతో పులివెందుల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. పులివెందుల ఆసుపత్రిలో స్వాతి నుంచి పోలీసులు స్టేట్​మెంట్​ రికార్డ్ చేశారు. తనకు, తన కుటుంబానికి ఏదైనా హాని జరిగితే దానికి కొమ్మ పరమేశ్వర్ రెడ్డిదే బాధ్యత అని ఆమె వెల్లడించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details