ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Flood Victims Gherao Chief Whip: నష్టం పరిహారం కొందరికే ఇస్తారా..? చీఫ్ విప్​ శ్రీకాంత్ రెడ్డి అడ్డగింత

By

Published : Nov 30, 2021, 4:57 PM IST

Chief Whip Srikanth Reddy Gherao: వరద నష్టం పరిహారం పంపిణీలో న్యాయం చేయాలంటూ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పలువురు నిరసనకు దిగారు. వరద బాధితులను పరామర్శించేందుకు శ్రీకాంత్ రెడ్డి.. రాయచోటి మండల పరిధిలోని పెమ్మాడపల్లికి వెళ్లారు. ఈ క్రమంలో కొందరికే పరిహారం ఇచ్చారంటూ పలువురు మహిళలు ఆయన్ను అడ్డగించారు.

Gadikota Srikanth Reddy
Chief Whip Gadikota Srikanth Reddy Gherao

Chief Whip Srikanth Reddy Gherao: కడప జిల్లా రాయచోటి మండలం పెమ్మాడపల్లిలో పర్యటనకు వెళ్లిన చీఫ్ విప్ శ్రీకాంత్​రెడ్డికి నిరసన సెగ తగిలింది. వరద నష్టం పరిహారం పంపిణీలో న్యాయం చేయాలంటూ పలువురు ఆందోళనకు దిగారు. గ్రామంలో ఇళ్లు కోల్పోయిన వారందరికీ నష్టపరిహారం ఇవ్వకుండా కొందరికే చెక్కులు ఇవ్వడం తగదంటూ మహిళలు ప్రశ్నించారు. వాలంటీర్ ఒక వర్గానికి చెందిన వారికే పరిహారం వచ్చేలా చూశాడని శ్రీకాంత్​రెడ్డి ఎదుట వాపోయారు. ఈ క్రమంలో తమపైనే ఫిర్యాదు చేస్తారా..? అంటూ సదరు మహిళలపై మరోవర్గం వాళ్లు ఘర్షణకు దిగారు. ఫలితంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వెంటనే చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అక్కడ్నుంచి వెనుదిరిగారు.పోలీసులు రంగప్రవేశం చేయటంతో.. వివాదం సద్దుమణిగింది.

ప్రభుత్వ చీఫ్ విప్​ శ్రీకాంత్ రెడ్డి అడ్డగింత

ABOUT THE AUTHOR

...view details