ETV Bharat / city

MPs spoke in Parliament: రాష్ట్రంలో వరదలపై రాజ్యసభలో ఎంపీలు గళం

author img

By

Published : Nov 30, 2021, 2:11 PM IST

AP MPs in Parliament: రాష్ట్రంలో వరదలపై పార్లమెంట్​లో ఎంపీలు మాట్లాడారు. వర్షాల కారణంగా పలు జిల్లాలు దారుణంగా దెబ్బతిన్నాయని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. వర్షాలపై వాతావరణ శాఖ ముందే సమాచారమిచ్చినా సరైన చర్యలు తీసుకోలేదని భాజపా ఎంపీ సీఎం రమేశ్ అన్నారు.

Parliament
Parliament

AP MPs in Parliament: వర్షాలతో ఏపీలో కొన్ని జిల్లాలు దారుణంగా దెబ్బతిన్నాయని రాష్ట్ర ఎంపీలు రాజ్యసభలో గళం వినిపించారు. రాజ్యసభలో ఏపీ వరదల అంశాన్ని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. ఆకస్మికంగా వచ్చిన వరదలతో వేలమంది నిరాశ్రయులయ్యారని చెప్పారు. వరదల వల్ల 44 మంది చనిపోయారని.. 16 మంది గల్లంతైనట్లు వివరించారు. 1.85లక్షల హెక్టార్లలో రూ.654 కోట్ల విలువైన పంటలు వరదల పాలయ్యాయని సభ దృష్టికి తీసుకెళ్లారు. ఇవి కాకుండా మొత్తంపై ప్రాథమికంగా రూ. 6,054 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారన్నారు. క్షేత్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అనేక సహాయక చర్యలు చేపట్టిందన్నారు. వరదల వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చడానికి కేంద్ర ప్రభుత్వం చేయూత అందించాలని విజయసాయిరెడ్డి కోరారు.

ప్రజలను అప్రమత్తం చేయడంతో ప్రభుత్వం విఫలం: సీఎం రమేశ్‌

BJP MP counter on State government: అనంతరం భాజపా ఎంపీ సీఎం రమేశ్‌ మాట్లాడుతూ వర్షాలపై వాతావరణశాఖ ముందే సమాచారం ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పింఛ, అన్నమయ్య ప్రాజెక్టుల నుంచి వరద పెద్ద ఎత్తున వచ్చిందన్నారు. వేల సంఖ్యలో పశువులు కొట్టుకుపోయాయని చెప్పారు. ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని.. అందుకే పెద్ద ఎత్తున నష్టం జరిగిందని ఆయన ఆరోపించారు.

ఇదీ చదవండి

Weather Update in AP: మరో 12 గంటల్లో దక్షిణ అండమాన్​లో అల్పపీడనం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.