ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గురువారం విద్యాసంస్థల బంద్​కు పిలుపునిచ్చిన రాయలసీమ జేఏసీ

By

Published : Nov 6, 2019, 9:50 PM IST

శ్రీభాగ్ ఒప్పందం అమలు చేయాలంటూ... గురువారం రాయలసీమ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు పాల్గొననున్నాయని రాయలసీమ ఐకాస నాయకులు రవిశంకర్ రెడ్డి తెలిపారు.

'శ్రీ భాగ్ ' అమలు చేయాలంటూ రాయలసీమ ఐకాస నాయకుల ధ్వజం

విద్యాసంస్థల బంద్​కు పిలుపునిచ్చిన రాయలసీమ ఐకాస

శ్రీభాగ్ ఒప్పందాన్ని అమలుచేయాలని కోరుతూ రాయలసీమ వ్యాప్తంగా గురువారం విద్యాసంస్థల బంద్ నిర్వహించనున్నామని... రాయలసీమ ఐకాస నాయకులు రవిశంకర్ రెడ్డి కడపలో అన్నారు. ఈ ఉద్యమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహాన్​రెడ్డి తేలికగా తీసుకుంటే.. ప్రభుత్వం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటుందని హెచ్చరించారు. పులివెందులలో రాజధాని, కర్నూలులో హైకోర్టు పెట్టుకోండి అన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపైనా స్పందించారు. సీఎంపై ఉన్న కోపాన్ని రాయలసీమ ప్రజలపై వెళ్లబుచ్చటం సరికాదని హితవు పలికారు. సామాజిక బాధ్యత కలిగిన పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం మంచిది కాదన్నారు.

Intro:ap_cdp_17_06_vidyasamthalu_avb_ap10040
రిపోర్టర్: సుందర్, ఈటీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
శ్రీబాగ్ ఒడంబడిక అమలుచేయాలని కోరుతూ రాయలసీమ వ్యాప్తంగా రేపు విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నట్లు రాయలసీమ ఐకాస నాయకులు రవి శంకర్ రెడ్డి అన్నారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాయలసీమ పై పవన్ కళ్యాణ్ నిర్లక్ష్యంగా వ్యాఖ్యలు చేయడం తగదని ఖండించారు. పులివెందులలో రాజధాని, కర్నూలులో హైకోర్టు పెట్టుకోండి అంటూ మాట్లాడడం సరికాదన్నారు. జగన్మోహన్రెడ్డి మీద కోపం ఉంటే ఇలా మాట్లాడడం తగదన్నారు. రాయలసీమ ఉద్యమాన్ని జగన్మోహన్ రెడ్డి చాలా తేలిక తీసుకుంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. రాయలసీమ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఈనెల 16న రాయలసీమ వ్యాప్తంగా భారీ ఎత్తున బైక్ ర్యాలీ చేపడుతున్నామని పేర్కొన్నారు.
byte: రవి శంకర్ రెడ్డి, రాయలసీమ ఐకాస నాయకులు.


Body:రేపు విద్యాసంస్థల బంద్


Conclusion:కడప

TAGGED:

ABOUT THE AUTHOR

...view details