ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పులివెందులలో బీభత్సం సృష్టించిన కారు.. ఒకరు మృతి

By

Published : Dec 18, 2022, 6:01 PM IST

Car bike accident in Kadapa: వైఎస్సార్ జిల్లా పులివెందులలోని కడప రోడ్డులో మెడికల్ కళాశాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వీరిలో మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తీసుకెళ్లారు.

రోడ్డు ప్రమాదం
Car Bike

Car Bike Accident In Kadapa: వైఎస్సార్ జిల్లా పులివెందులలోని కడప రోడ్డులో మెడికల్ కళాశాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే పులివెందుల నుంచి కడప వైపు వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న స్కూటీని తప్పించబోయి ఆటోను ఢీకొట్టాడు.అనంతరం రెండు బైకులను ఢీకొట్టడంతో వేముల మండలం కె. కె. కొట్టాల గ్రామానికి చెందిన దాసరి విజయకుమార్ అనే వ్యక్తి మృతి చెందగా మరో నలుగురు తీవ్ర గాయాలు పాలయ్యారు. వీరిలో మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details